గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రక్రియను ఆపాలని కోరుతూ భాజపా నేత, జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ హైకోర్టును ఆశ్రయించారు. వార్డుల రిజర్వేషన్ రోస్టర్ విధానం రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ పిటిషన్ దాఖలు చేశారు.
గతంలో ఐదేళ్లకోసారి రిజర్వేషన్లు మార్చే విధానం ఉండేదని.. పదేళ్ల పాటు రిజర్వేషన్ కొనసాగేలా ఇటీవల జీహెచ్ఎంసీ చట్టాన్ని సవరించారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. జీహెచ్ఎంసీ చట్ట సవరణ రాజ్యాంగ విరుద్ధమని.. దాని వల్ల కొన్నివర్గాలకు అన్యాయం జరుగుతుందన్నారు.
ఎన్నికలకు సంబంధించిన అంశమైనందున ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి బదిలీచేయాలని.. జస్టిస్ అభిషేక్ రెడ్డి రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగే అవకాశం ఉంది.
ఇవీచూడండి: జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆపాలన్న పిల్‌పై హైకోర్టు ఆగ్రహం