నేడు జీహెచ్ఎంసీ పాలకవర్గం కొలువుదీరనున్న నేపథ్యంలో భాజపా కార్పొరేటర్లు బషీర్‌బాగ్ ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్సీ రాంచందర్ రావు.. భాజపా మేయర్ అభ్యర్థిగా ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ పేర్లను ప్రకటించారు.
పూజల అనంతరం బషీర్‌బాగ్ ఆలయం నుంచి భాజపా కార్పొరేటర్లు వెజ్పార్క్ హోటల్‌కు వెళ్లారు. అక్కడినుంచి జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లారు.