ETV Bharat / city

గ్రేటర్ గద్దె కోసం భాజపా వ్యూహాలు.. తెరాస వైఫల్యాలే ప్రధానాస్త్రాలు

దుబ్బాక గెలుపుతో జోరు మీదున్న భాజపా బల్దియా పీఠాన్ని కైవసం చేసుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. ప్రచారపర్వానికి తక్కువ సమయం ఉండటం వల్ల ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్న యోచనలు చేస్తోంది. 150 డివిజన్లలో పాదయాత్రలు, వీధి, బహిరంగ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రచార తారలను రంగంలోకి దింపి.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే మార్గాలపై దృష్టి సారిస్తోంది.

bjp campaign in ghmc elections 2020
గ్రేటర్ గద్దె కోసం భాజపా వ్యూహాలు
author img

By

Published : Nov 21, 2020, 9:38 AM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు తెరపడటం వల్ల భాజపా రాష్ట్ర నాయకత్వం ప్రచారంపై దృష్టి సారించింది. పార్టీ జాతీయ కార్యదర్శి భూపేంద్రయాదవ్​ను బల్దియా ఎన్నికల ఇంఛార్జిగా నియమించింది. క్షేత్రస్థాయిలో ఆయన నిర్వహించాల్సిన ప్రచార వ్యూహాలపై రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. తెరాస వైఫల్యాలను ఎండగట్టడమే ప్రధాన అస్త్రంగా ప్రచారం నిర్వహించనున్నారు. రాష్ట్ర సర్కార్ ప్రజా వ్యతిరేకవిధానాలను ఎండగడుతూనే.. కేంద్రం తెలంగాణకు వెచ్చించిన నిధులను ప్రచారాస్త్రాలుగా మలుచుకోవాలని భావిస్తున్నారు.

బల్దియా ఎన్నికల కమిటీ ఛైౌర్మన్​గా కిషన్ రెడ్డి

జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను ఇంఛార్జ్‌లుగా నియమించింది. ప్రతి డివిజన్‌ బాధ్యతను రాష్ర్టస్థాయి నేతకు అప్పగించింది. వీరితో పాటు స్టార్‌ క్యాంపెయినర్స్‌గా పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్, మురళీధర్‌రావు, వివేక్‌ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావు, ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, రఘునందన్‌ రావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌లను ప్రకటించింది. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా నియమించడం వల్ల ఆయన.. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పనిచేస్తున్నారు.

కేంద్ర మంత్రి పదవికే ప్రమాదం

కిషన్‌ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్‌ పరిధిలోనే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడి ఫలితాలు ఆశాజనకంగా రానిపక్షంలో కిషన్‌ రెడ్డి కేంద్రమంత్రి పదవికే ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఓవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రచారాన్ని తన భుజాన వేసుకుంటూనే సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో మరింత ఎక్కవ ప్రచారానికి సమయం వెచ్చించాలని కిషన్ రెడ్డి భావిస్తున్నారు. ఉదయం.. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గంలో.. సాయంత్రం సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో రోజు ప్రచారాన్ని నిర్వహించేందుకు కిషన్‌ రెడ్డి రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసుకుంటున్నారు.

రెట్టింపు ఉత్సాహంతో

ప్రతి స్టార్‌ క్యాంపెయినర్​కు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను అప్పగించాలని భావిస్తోంది. ఎన్నికల పరిశీలకుడు భూపేంద్రయాదవ్‌ నేతృత్వంలో సమావేశమై ఎవరికి ఏ నియోజకవర్గం అప్పగించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. దుబ్బాక ఎన్నికల్లో ఎంత కసితో పనిచేశామో.. రెట్టింపు ఉత్సాహంతో ఇప్పుడు పనిచేస్తామని కమలనాథులు చెబుతున్నారు. బూత్‌స్థాయిలో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసిన భాజపా.. సామాజిక మాధ్యమాలను పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. మరో వైపు జనసేన మద్దతు కూడా లభించడం విజయానికి దోహదం చేస్తోందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.