ETV Bharat / city

ఆ 3 చోట్ల ఓట్ల లెక్కింపుపై భాజపా ఏజెంట్ల అభ్యంతరాలు...

author img

By

Published : Dec 4, 2020, 12:07 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న ఓట్ల లెక్కింపుపై పలు కేంద్రాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కూకట్​పల్లిలోని పలు డివిజన్​లలో ఓట్ల లెక్కింపుపై భాజపా ఏజెంట్లు అభ్యంతరాలు తెలిపారు. మౌలాలి, జాంబాగ్​లోనూ ఇదే తీరులో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

BJP agents objections on counting of votes in kukatpally

హైదరాబాద్​ కూకట్​పల్లిలోని పలు డివిజన్లలో జరుగుతున్న ఓట్ల లెక్కింపుపై భాజపా ఏజెట్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వివేకానందనగర్, మౌలాలి, జాంబాగ్​ డివిజన్ల‌లో భాజపా ఏజెట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలైన ఓట్ల కంటే ఆధికంగా ఓట్లు ఉన్నాయని వివేకానందనగర్​ భాజపా ఏజెంట్ ఆరోపించారు. బ్యాలెట్ బాక్సు సీలు సక్రమంగా లేదని ఏకాంత్‌గౌడ్ బయటకు వెళ్లిపోయారు. బూత్ నంబరు 76లో పోలైన ఓట్ల కంటే 200పైగా ఎక్కువగా ఉన్నాయని అభ్యంతరం తెలిపారు.

మౌలాలి డివిజన్‌లోని ఓ బ్యాలెట్ బాక్సులో 33 ఓట్లు అధికంగా వచ్చాయి. మొత్తం 361 ఓట్లకు గాను 394 ఓట్లు ఉండటం వల్ల కౌంటింగ్ నిలిపివేశారు. ఈ విషయాన్ని సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జాంబాగ్ డివిజన్​లో సైతం ఓట్ల లెక్కింపుపై భాజపా అభ్యంతరం వ్యక్తం చేసింది. జాంబాగ్ డివిజన్​లోని‌ బూత్ నంబరు 8లో 471 ఓట్లు పోలయ్యాయి. బ్యాలెట్ బాక్సులో 257 ఓట్లు ఉండటంపై భాజపా ఏజెంటు అభ్యంతరం వ్యక్తం చేశారు. మిగతా ఓట్ల గల్లంతుపై ఆరా తీయగా... పోలింగ్ శాతం తప్పుగా వెల్లడించామని అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: ఘాన్సీపూర్‌, పూరానాపూల్‌పై ఎస్ఈసీ స్పష్టత.. నో రీపోలింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.