ETV Bharat / city

మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ - మంత్రి కేటీఆర్ పుట్టినరోజు

పుట్టిన రోజు సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు ప్రజాప్రతినిధులు, సీని ప్రముఖులు, తెరాస శ్రేణులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హ్యాపీ బర్త్​డే కేటీఆర్ హ్యాస్ ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్​లో ఉంది. గిఫ్ట్​ ఏ స్మైల్ పేరుతో ఓ చిరునవ్వును... ఆయన పేరున కానుకగా ఇచ్చే కార్యక్రమంతో అభిమానులు ముందుకెళ్తున్నారు.

ktr
ktr
author img

By

Published : Jul 24, 2020, 12:17 PM IST

ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తున్న కేటీఆర్ నేటి యువతకు ఆదర్శమని సభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు.

మంత్రి కేటీఆర్‌కు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యం, సంతోషంగా ఉండాలని ట్వీట్ చేశారు. థాంక్యూ అన్న అంటూ కేటీఆర్ రిప్లై ఇచ్చారు.

కేటీఆర్‌కు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విష్ చేశారు. ఆరోగ్యం, సౌభాగ్యంతో ఉండాలని చిలుకూరి బాలాజీని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. థాంక్యూ అన్న అంటూ కేటీఆర్ రిప్లై ఇచ్చారు.

మంత్రి కేటీఆర్‌కు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

అవసరమున్న ప్రతి పౌరునికి అందుబాటులో ఉంటూ.. వారిని వ్యక్తిగతంగా చేరుకుంటూ సహాయం అందిస్తున్న మీ వ్యక్తిత్వానికి నేను ఎల్లప్పుడూ సంతోషపడతాను. రాష్ట్ర ప్రజలకు మీరిచ్చే భరోసాకు నా కృతజ్ఞతలు. ప్రజలకు మరింత సేవ చేసేందుకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నారు.

- చిరంజీవి

మంత్రి కేటీఆర్‌కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తెరాస శ్రేణులతో పాటు సినీ ప్రముఖులు మహేశ్‌ బాబు, ప్రకాశ్‌ రాజ్, మంచు లక్ష్మీ, హరీశ్‌ శంకర్, కోన వెంకట్, యాంకర్ అనసూయ, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

కరోనా నేపథ్యంలో పుట్టిన రోజు వేడుకలకు, ఆర్భాటాలకు మంత్రి కేటీఆర్ దూరంగా ఉంటున్నారు. గిఫ్ట్​ ఏ స్మైల్ పేరుతో ఓ చిరునవ్వును... ఆయన పేరున కానుకగా ఇచ్చే కార్యక్రమంతో అభిమానులు ముందుకెళ్తున్నారు.

ఇదీ చదవండి: కేటీఆర్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.