వియత్నాం నౌకాదళంతో సంయుక్త విన్యాసాల నేపథ్యంలో.... తూర్పు నౌకాదళం నుంచి మరో రెండు నౌకలు దక్షిణ చైనా సముద్రంలోకి ప్రవేశించాయి. ఐఎన్ఎస్(INS) రణవిజయ్, ఎన్ఎస్ఎస్ కోరాలు ద్వైపాక్షి సముద్ర విన్యాసాలను నిర్వహించేందుకు అక్కడికి చేరుకున్నాయి. వియత్నాం నేవీ యుద్ధ నౌక లే ధాయ్ కూడా ఈ విన్యాసాలలో పాల్గొననుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం ఈ విన్యాసాలు ఉపకరించనున్నాయి. నౌక నుంచి నౌక మీదకు హెలికాప్టర్లు దిగడం.., ఫిరంగులు, టాంకర్ల వినియోగంతోపాటు యుద్ధ విమానాలతో సమన్వయం చేసుకుని విన్యాసాలు నిర్వహిస్తారు. రెండు దేశాల మధ్య రక్షణ రంగంలో ఈ ఏడాది జూన్లో కుదిరిన ఒప్పందంలో.. భారత నౌకలు తరుచుగా వియత్నాం పోర్టులను సందర్శించాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి: Lady Cheater: మాయలే(లా)డి వలపు వలలో చిక్కి సూసైడ్ యత్నం