ETV Bharat / city

చరవాణి కేసు లాగితే కేటుగాళ్ల డొంక కదిలింది

విలాసాలకు అలవాటు పడి ముఠాలుగా ఏర్పడ్డారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో దొంగతనాలు మొదటుపెట్టారు. ఖరీదైన బైకులే లక్ష్యంగా వరుస చోరీలకు పాల్పడుతూ... నగర పోలీసులకు చుక్కలు చూపించారు. ద్విచక్రవాహనాలతోపాటు చేతుల్లోని చరవాణులనూ ఎత్తుకెళ్లి హడలెత్తించారు. చివరికి ఓ మొబైల్ దొంగతనం కేసు విచారణలో డొంక కదిలి... కటకటాలపాలయ్యారు ఈ కేటుగాళ్లు.

చరవాణి కేసు లాగితే కేటుగాళ్ల డొంక కదిలింది
చరవాణి కేసు లాగితే కేటుగాళ్ల డొంక కదిలింది
author img

By

Published : Dec 17, 2019, 5:22 AM IST

Updated : Dec 17, 2019, 7:38 AM IST

హైదరాబాద్‌ మహానగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న రెండు ముఠాలకు... మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసుల చెక్ పెట్టారు. గతనెలలో సైఫాబాద్ పోలీస్టేషన్ పరిధిలో రాత్రి సమయంలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా... ద్విచక్రవాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు దాడి చేసి చరవాణి అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.... సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. అప్పటి వరకు 27 ద్విచక్రవాహనాలు చోరీ చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారు. వారు ఇచ్చిన ఆధారాలతో మరో గ్యాంగ్‌నూ అదుపులోకి తీసుకున్నారు. రెండు ముఠాల్లోని 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు.

ముఠాలో ప్రధాన నిందితుడైన బజార్‌ఘాట్‌కి చెందిన అబ్దుల్ వాహెద్ అలియాస్ అఫ్రోజ్ బైక్ మెకానిక్. విలాసాలకు అలవాటు పడి దొంగతనాలకు తెరలేపాడు. తాళాలు లేకుండా బైకులు దొంగలించడంలో ఆరితేరాడు. మరో ముగ్గురితో కలిసి ముఠాగా ఏర్పడి వరుస దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. హర్షవర్దన్ అనే వ్యక్తి మరో గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి బైకులు, చరవాణులు చోరీ చేస్తున్నట్లు తెలిపారు. పట్టుబడిన ఈ రెండు గ్యాంగ్‌లలో ఓ మైనర్ కూడా ఉన్నట్లు వివరించారు.

మూడు కమిషనరేట్ల పరిధిలోని 19 పోలీసు స్టేషన్లలో వీరిపై 33 కేసులు నమోదు అయ్యాయి. 9మంది నిందితులను, వీరి నుంచి కొనుగోలు చేస్తున్న మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. 27 ద్విచక్రవాహనాలు, ఒక ఆటో, 5 చరవాణులు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. వీరు దొంగిలించిన సొత్తు సుమారు 25 లక్షల విలువ ఉంటుందని తెలిపారు. నగరంలో జరుగుతన్న ఇలాంటి ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని... అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100ని వినియోగించుకోవాలని సీపీ అంజనీ కుమార్ సూచించారు.

చరవాణి కేసు లాగితే కేటుగాళ్ల డొంక కదిలింది

ఇవీచూడండి: 'వెళ్లి తిరిగొచ్చేసరికి ఇల్లు గుల్ల'

TG_HYD_01_17_BYK_CHORY_GANG_ARREST_PKG_3182400 ( )విలాసాలకు అలవాటు పడ్డారు...గ్యాంగ్ గా ఏర్పడి సులభంగా డబ్బు సంపాదించాలను కున్నారు..అందుకు ఖరీదైన బైకులు లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్నారు..మూడు కమిషనరేట్ల పరిధిలో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చుక్కలు చూపించారు...ద్విచక్ర వాహనాతో పాటు అదును చూసి చేతుల్లో ఉన్న చరవాణులు కూడా చోరీ చేస్తూ హడలెత్తించారు..చివరికి ఓ చరవాణి దొంగతనం విచారణలో దొరికిన సీసీటివి ద్వారా నిందితులు డొంకంతా కదిలింది...ఇంతకీ ఎవరా కేటుగళ్ళు...look వాయిస్ హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఇటీవల వరుస బైకులు చోరీలతో హడలెత్తించిన రెండు ముఠా సభ్యలకు మధ్య మండల టాస్క్ ఫోర్స్ పోలసుల చెక్ పెట్టారు...గత నెలలో సైఫాబాద్ పోలీస్టేషన్ పరిధిలో రాత్రి సమయంలో నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తి పై ద్విచక్ర వాహనం పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు దాడి చేసి అతని చరవాణి దొంగలించడంతో ఆవ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు...కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం సీసీటివి ఫుటేజ్ విజువల్స్ ద్వారా నిందితులను పట్టుకున్న పోలీసులు ఆ ద్విచక్ర వాహనం గురించి కూడా ఆరా తీశారు...దీంతో అసలు విషయం బయట పడింది...అప్పటి వరకూ 27 ద్విచక్ర వాహనాలు చోరీ చేశామని చెప్పడంతో పోలీసులే నోళ్ళు వెళ్ళబెట్టారు..ఈ నిందితులు ఇచ్చిన ఆధారాలతో మరొక గ్యాంగ్ ని కూడా పట్టుకున్నారు...మొత్తం రెండు ముఠాల్లోని 11 మంది సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు... బైట్: అంజనీ కుమార్, హైదరాబాద్ పోలిస్ కమిషనర్ వాయిస్ ముఠాలో ప్రధాన నిందితుడైన బజార్ ఘాట్ కి చెందిన అబ్దుల్ వాహెద్ అలియాస్ అఫ్రోజ్ బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు...విలాసాలకు అలవాటు పడి దొంగతనాలకు తెరలేపాడు...తాళాలు లేకుండా బైకులు దొంగలించడంలో ఆరితేరాడు..మరో ముగ్గురితో కలిసి దొంగతనాలు చేస్తుంన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరితో హర్షవర్దన్ మరో గ్యాంగ్ ను ఏర్పాటు చేసి బైకులతో పాటు చరవాణులు చోరీలు చేస్తున్నట్లు తెలిపారు...పట్టుబడిన ఈ రెండు గ్యాంగ్ లో ఓ మైనర్ కూడా ఉన్నట్లు పోలీసుల వివరించారు.మూడు కమిషనరేట్ల పరిధుల్లో 19 పోలీసు స్టేషన్లలో వీరిపై 33 కేసులు నమోదు అయ్యాయి...9మంది నిందితులతో పాటు దొంగలించిన సోత్తును వీరి నుంచి కొనుగోలు చేస్తున్న మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 27 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో 5 చరవాణుల స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్ కి తరలించారు...దొంగలించిన సొత్తు విలువ సుమారు 25 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. బైట్: అంజనీ కుమార్, హైదరాబాద్ పోలిస్ కమిషనర్ ఎండ్ వాయిస్ ఇలాంటి ఘటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100ని వినియోగించుకోవాలని సీపీ అంజనీ కుమార్ సూచించారు.
Last Updated : Dec 17, 2019, 7:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.