Bike Racing in hyderabad: బైక్ రేసింగ్ కల్చర్ ఇప్పుడు నగర నడిబొడ్డు వరకు పాకింది. ప్రధాన రహదారులపై యువకులు బైక్ రేసింగులు, విన్యాసాలతో రెచ్చిపోతున్నారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు యువత రేసింగులకు పాల్పడుతూ.. వీరంగం సృష్టిస్తున్నారు. 100 నుంచి 150 ద్విచక్రవాహనాలతో రేసులకు పాల్పడుతూ.. విన్యాసాలు చేస్తూ.. రోడ్లపై ఇతర వాహనదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. అధిక వేగంతో రయ్‌రయ్‌మంటూ చక్కర్లు కొడుతూ.. స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తున్నారు.
ముఖ్యంగా సైదాబాద్, మాదన్నపేట, చంద్రాయణగుట్ట, డబీర్‌పురా, చాదర్‌ఘాట్, చంచల్ గూడ ప్రాంతాల్లో రాత్రంతా బైక్ రేసింగులు జరుగుతున్నట్టు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఆయా ప్రాంతాలపై నిఘుపెట్టారు. పలువురు యువకులను అరెస్టు చేసిన పోలీసులు.. రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే చంచల్‌గూడ జైల్ రోడ్డులో కొనసాగుతున్న యువకుల బైక్ రేసింగ్ అందరిని హడలెత్తిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి: