రోడ్డుపై వెళుతున్న ద్విచక్ర వాహనం నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వాహనచోదకుడు బైకుపై నుంచి దూకి పరుగులు తీశాడు. కాసేపట్లోనే బైక్ పూర్తిగా దగ్ధమైంది.
ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం.. ఎర్రన్నగుడి సమీపంలో జరిగింది. బైకు బ్యాటరీ నుంచి మంటలు వ్యాపించి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి : పెళ్లని నమ్మించింది... రూ.5 కోట్లు కొట్టేసింది!