ETV Bharat / city

ర్యాలీలో అపశృతి.. బైక్​పై పెట్రోల్‌ పోసి తనపై పోసుకున్న కార్యకర్త.. చివరికి..! - అనకాపల్లిలో వైకాపా ర్యాలీలో బైక్​ దగ్ధం

Bike caught fire: ఏపీలో మూడు రాజధానులకు మద్దతుగా చోడవరంలో వైకాపా నిర్వహించిన మానవహారంలో ఓ వ్యక్తి హల్​చల్​ చేశాడు. బైక్​పై పెట్రోల్​ పోయడమే కాకుండా.. తనపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకోబోయాడు. ఈలోగా అక్కడ ఉన్నవాళ్లు అతన్ని దూరం తీసుకెళ్లారు. ఈలోగా హఠాత్తుగా బైక్​కు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి.

Bike caught fire
Bike caught fire
author img

By

Published : Oct 13, 2022, 6:56 PM IST

Bike caught fire: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా చోడవరంలో వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రాజధానులకు మద్దతుగా చేపట్టిన మానవహారంలో అపశృతి చోటు చేసుకుంది. ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ సారథ్యంలో మూడు రాజధానులకు మద్దతుగా చోడవరంలో బైకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం చోడవరం కూడలిలో మానవహారం చేపట్టారు.

ర్యాలీలో అపశృతి.. బైక్​పై పెట్రోల్‌ పోసి తనపై పోసుకున్న కార్యకర్త.. చివరికి..!

ఈ మధ్యలో పి.ఎస్.పేటకు చెందిన సి.హెచ్. శ్రీనివాస్ తన బైకును మానవహారం మధ్యలో పడేసి.. పెట్రోల్ పోసి తనపైనా పెట్రోల్ పోసుకున్నాడు. ఆ యువకుడిని ధర్మశ్రీ, కార్యకర్తలు నివారించి వెనక్కి లాగేశారు. ఈలోగా బైక్​కు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. దీంతో వైకాపా కార్యకర్తలు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ జరగకపోటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.