ETV Bharat / city

బిహార్​లోని దర్భంగా పేలుళ్లకు సికింద్రాబాద్​లో లింక్ - దర్భాంగా రైల్వే స్టేషన్ పేలుడు

బిహార్ దర్భంగా రైల్వే స్టేషన్​ పరిసరాల్లో ఇటీవలే జరిగిన బాంబు పేలుళ్ల లింక్.. సికింద్రాబాద్​లో బయటపడింది. దర్యాప్తులో భాగంగా రైల్వే స్టేషన్ పార్శిల్ కౌంటర్ వద్ద ఉన్న సీసీ ఫుటేజ్​ని దర్భంగా జీఆర్పీ రైల్వే పోలీసులు పరిశీలించారు. జూన్ 15న ఓ రిజిస్టర్ పార్శిల్​ను అనుమానితుడు...దర్భంగాకు చేరవేసినట్లు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు.

bihar-police-are-investigating-in-secunderabad-railway-station-for-blast-at-the-darbhanga-railway-station-in-north-bihar-at-a
బిహార్​లోని దర్భంగా పేలుళ్లకు సికింద్రాబాద్​లో లింక్
author img

By

Published : Jun 23, 2021, 7:20 PM IST

నార్త్ బిహర్​లోని దర్భంగా రైల్వే స్టేషన్ పార్శిల్ జంక్షన్ వద్ద జరిగిన పేలుడుకు సంబందించిన లింక్ సికింద్రాబాద్​లో వెలుగు చూసింది. పేలుళ్ల ఘటనలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్శిల్ కౌంటర్ వద్ద ఉన్న సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్​ను దర్భంగా జీఆర్పీ రైల్వే పోలీసులు తీసుకున్నారు. జూన్ 15న ఓ రిజిస్టర్ పార్శిల్​ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఓ అనుమానితుడు దర్భంగాకు చేరవేసినట్లు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు.

పార్శిల్ ఆధారంగా..

జూన్ 17 న బిహార్ దర్భంగా రైల్వే స్టేషన్ పార్శిల్ జంక్షన్ వద్ద తక్కువ తీవ్రతతో పేలుళ్లు సంభవించాయి. ప్రమాదం నుంచి ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో పేలుడుకు సంబందించిన వస్త్రాలతో కూడిన ఓ పార్శిల్​ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. దీంతో దర్భంగా రైల్వే పోలీసులు ఆఫీసర్-ఇంఛార్జీ హరున్ రషీద్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం సికింద్రాబాద్​లో విచారణ ప్రారంభించింది.

దర్యాప్తులో భాగంగా... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్శిల్ కౌంటర్ వద్ద విచారణ చేపట్టారు. జూన్ 15న అనుమానిత రిజిస్టర్ పార్శిల్​ను​ సరిగ్గా 3:25 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఓ అనుమానితుడు... దర్భంగాకు చేరవేసినట్లు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. పార్శిల్ బుకింగ్ వివరాలతో పాటు, సీసీ టీవీ వీడియోలను పరిశీలించి తిరుగు ప్రయాణం అయ్యారు.

ఇదీ చూడండి: Insurance: బీమా ఏ వయస్సులో ఎలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.