కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ అధికారులు సీట్ల భర్తీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మండిపడ్డారు. నిబంధనల ప్రకారం మొదట ఓపెన్ కేటగిరి సీట్లు భర్తీ చేసి తరువాత రిజర్వేషన్ సీట్లను భర్తీ చేయాలి.
కానీ యూనివర్సిటీ యాజమాన్యం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపించారు. ఈ పద్ధతి దేశంలోనే ఎక్కడా లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలతో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: 'భూముల విషయం కాకుండా ప్రజా సమస్యలపై స్పందించాలి'