లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ను సవాలు చేస్తూ... కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పేద, మధ్య తరగతి కుటుంబాలను ఇబ్బంది పెట్టేలా... ఎల్ఆర్ఎస్ ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. తప్పు చేయకున్నా... ప్రజలు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎప్పుడో కొన్న ప్లాట్ ధరలో దాదాపు సగం మళ్లి కట్టాల్సి వస్తుందని పిటిషన్లో వివరించారు.
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో సుమారు 3 నుంచి 5 లక్షల ప్లాట్లు ఉన్నాయన్న కోమటిరెడ్డి... అనుమతులు లేని వెంచర్లపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. అధికారులు తప్పు చేస్తే... సామాన్యులపై జరిమానా విధించడం సమంజసం కాదన్నారు. జరిమానా లేకుండా క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. చట్ట విరుద్ధమైన ఎల్ఆర్ఎస్ జీవోను కొట్టివేయాలని కోరారు.
ఇదీ చూడండి: తెలంగాణ ప్రభుత్వంపై న్యాయవిచారణ చేపట్టాలి: కోమటిరెడ్డి