ETV Bharat / city

'రాష్ట్రానికి కొత్త ఆరోగ్య శాఖ మంత్రిని నియమించాలి' - mp komati reddy criticises telangana cm kcr

రాష్ట్రానికి కొత్త ఆరోగ్య శాఖ మంత్రిని నియమించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి డిమాండ్ చేశారు. నిరంతరం వైద్యాధికారులకు అందుబాటులో ఉండే ఈటలను తొలగించడం దారుణమని అన్నారు.

mp komatireddy, mp komatireddy venkat reddy, bhuvanagiri mp venkat reddy, Hyderabad news
భువనగిరి ఎంపీ, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి
author img

By

Published : May 4, 2021, 4:49 PM IST

కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్ వద్ద ఆరోగ్యశాఖ ఉంటే భ్రష్టు పట్టి పోతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. ఫాంహౌజ్​కే పరిమితమైన కేసీఆర్.. రాష్ట్రాన్ని శ్మశాన తెలంగాణగా మారుస్తారని విమర్శించారు. వైద్యం అందక మృతిచెందుతున్న కరోనా బాధితుల కుటుంబాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ఇవాళ సాయంత్రంలోగా కొత్త ఆరోగ్య శాఖ మంత్రిని నియమించాలని ఎంపీ కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క సరైన మంత్రి కూడా లేరా అని ప్రశ్నించారు. హైదరాబాద్​ చుట్టుపక్కల తెరాస నేతలు వందల ఎకరాలు కబ్జా చేస్తే పట్టించుకోని కేసీఆర్.. మూడెకరాల భూమి కోసం ఎందుకంత తాపత్రయ పడుతున్నారని ప్రశ్నించారు. కరోనా ఉద్ధృతి అధికంగా ఉండి, రాష్ట్ర ప్రజలు అల్లకల్లోలంగా ఉన్న ఈ సమయంలో చిల్లర రాజకీయాలు చేయడమేంటని నిలదీశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.