ETV Bharat / city

'ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలి' - bhuvanagiri mp komatireddy pill in high court on private hospitals

కరోనా విపత్తు వేళ రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాల్లాగే.. తెలంగాణ సర్కార్ కూడా ఉపశమన చర్యలు తీసుకోవాలని కోరారు.

mp komatireddy, mp komatireddy pill in high court
ఎంపీ కోమటిరెడ్డి, హైకోర్టులో ఎంపీ కోమటిరెడ్డి పిల్
author img

By

Published : May 25, 2021, 7:40 PM IST

కరోనా విపత్తు వేళ రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులు కొవిడ్ బాధితులతో నిండిపోయాయని, ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉందని పిల్​లో పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కరోనా బాధితులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరి భారీ ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సల ఖర్చులను ప్రభుత్వమే నిర్ణయించాలని కోరారు. ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాల్లాగే.. తెలంగాణ సర్కార్ కూడా ఉపశమన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాఖలు చేసిన హౌజ్ మోషన్ పిటిషన్ విచారణపై ఉన్నత న్యాయస్థానం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.