ETV Bharat / city

నేడు సాయంత్రం భారత మాతకు మహా హారతి - నేడు సాయంత్రం భారత మాతకు మహా హారతి

భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో..  ఈ రోజు సాయంత్రం హైదరాబాద్​లో నిర్వహించే భారత మాతకు మహా హారతి కార్యక్రమం ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారత మాత విగ్రహాన్ని ఎన్టీఆర్ గార్డెన్ నుంచి ఐమాక్స్ థియోటర్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ మైదానం వరకు.. ఊరేగింపుగా తీసుకెళ్లారు.

bharath mata harathi in Hyderabad
నేడు సాయంత్రం భారత మాతకు మహా హారతి
author img

By

Published : Jan 26, 2020, 12:12 PM IST

హైదరాబాద్​లో ఈరోజు సాయంత్రం భారత మాతకు మహా హారతి నిర్వహించనున్నారు. భారత మాత విగ్రహాన్ని ఎన్టీఆర్ గార్డెన్ నుంచి ఐమాక్స్ థియోటర్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ మైదానం వరకు.. ఊరేగింపుగా తీసుకెళ్లారు. అంతక ముందు భారత మాతకు హారతి ఇచ్చిన భాజపా మాజీ ఎమ్మెల్యే చింతల రామచందర్ రెడ్డి.. ట్రాక్టర్ నడుపుతూ ర్యాలీ కొనసాగించారు.

ప్రపంచ రికార్డు కోసం మూడు వేల మంది విద్యార్థినులు భరతమాత వేషధారణతో పాల్గొంటారని చింతల రామచందర్ రెడ్డి తెలిపారు. గత ఏడాది రెండు వేల మంది పాల్గొన్న ప్రపంచ రికార్డును ప్రస్తుత కార్యక్రమంలో అధిగమిస్తామన్నారు. ఆదివారం సాయంత్రం నెక్లెస్ రోడ్డు హెచ్ఎండీఏ మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, జనసేన పార్టీ పవన్ కల్యాణ్ తదితరుల సమక్షంలో జరిగే... కార్యక్రమానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు హాజరై రికార్డును నమోదు చేయనున్నారు.

నేడు సాయంత్రం భారత మాతకు మహా హారతి

ఇవీచూడండి: ఆర్టీసీ కార్గో సేవలకు ముహూర్తం ఖరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.