ETV Bharat / city

విజయవాడ దుర్గగుడికి భారత్​ బయోటెక్​ రూ. కోటి విరాళం - Bharat Biotech donation to Durga temple

Bharat Biotech donates Rs 1 crore: ఏపీలోని విజయవాడ దుర్గ గుడిలో నిత్యాన్నదాన పథకానికి భారత్‌ బయోటెక్‌ సంస్థ రూ.కోటి విరాళాన్ని అందజేసింది. మూడు దశాబ్దాల్లో నిత్యాన్నదానానికి వచ్చిన విరాళాల్లో ఈ విరాళం అత్యధికమని ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు.

విజయవాడ దుర్గగుడికి భారత్​ బయోటెక్​ రూ. కోటి విరాళం

author img

By

Published : Apr 2, 2022, 7:23 AM IST

Bharat Biotech donates 1 crore : విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి భారత్‌ బయోటెక్‌ సంస్థ రూ.కోటి విరాళాన్ని అందజేసింది. ఆన్‌లైన్‌ ఖాతాలో ఆ మొత్తాన్ని జమ చేసింది. ముందుగా భారత్‌ బయోటెక్‌ ప్రతినిధులు దేవస్థానం అధికారులను సంప్రదించి బ్యాంకు ఖాతా నెంబరు తీసుకున్నారు. తర్వాత విరాళం మొత్తాన్ని ఆన్‌లైన్​లో బదిలీ చేశారు.

1991లో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల నిత్యాన్నదాన పథకం రూ.15లక్షలతో ప్రారంభించారు. మూడు దశాబ్దాల్లో నిత్యాన్నదానానికి వచ్చిన విరాళాల్లో భారత్‌ బయోటెక్‌ సంస్థ అందజేసిన విరాళం అత్యధికంగా ఉన్నదని ఈవో భ్రమరాంబ తెలిపారు. ఈవోగా బాధ్యతలు చేపట్టిన ఒక సంవత్సరంలో అన్నదానానికి ప్రస్తుతం వచ్చిన విరాళంతో కలిపి రూ.11 కోట్లు జమచేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అన్నదానానికి భక్తులు ఇచ్చిన విరాళాలు రూ.90కోట్లకు చేరినట్లు ఈవో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Ugadi 2022: ఉగాడి పచ్చడి షడ్రుచుల్లో దాగున్న ఆరోగ్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.