ETV Bharat / city

Ganesh Nimajjanam: నిమజ్జనంపై అయోమయానికి ప్రభుత్వమే కారణం: భాగ్యనగర్‌ ఉత్సవసమితి - ganesh nimajjanam 2021

Bhagyanagar Utsav Committee fires on telangana government about ganesh nimajjanam
నిమజ్జనంపై అయోమయానికి ప్రభుత్వమే కారణం: భాగ్యనగర్‌ ఉత్సవసమితి
author img

By

Published : Sep 15, 2021, 4:18 PM IST

Updated : Sep 15, 2021, 5:12 PM IST

16:15 September 15

నిమజ్జనంపై అయోమయానికి ప్రభుత్వమే కారణం: భాగ్యనగర్‌ ఉత్సవసమితి

గణేశ్‌ నిమజ్జనంపై గందరగోళానికి ప్రభుత్వ వైఖరే కారణమని భాగ్యనగర్‌ ఉత్సవసమితి ఆరోపించింది. సుప్రీంకోర్టులో తీర్పు అనుకూలంగా రాకపోతే ఏం చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రత్యేక ఆర్డినెన్స్‌తో నిమజ్జనాలు సాఫీగా జరిగేలా చూడాలని సూచించింది. జల్లికట్టు కోసం తమిళనాడు తరహాలో నిర్ణయం తీసుకోవాలని భాగ్యనగర్‌ ఉత్సవసమితి కోరింది. ఒక్కరోజు నిమజ్జనంతో చెరువులు కాలుష్యం అనేది సమంజసం కాదని పేర్కొంది. యధావిధిగా నిమజ్జనాలకు అనుమతించాలని కోరింది. 

ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని.. రేపు హైదరాబాద్‌లో 50 కేంద్రాల్లో ఉదయం 10 గంటలకు ధర్నాలు చేస్తామని ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వ వైఖరిని బట్టి తమ తదుపరి కార్యచరణ ఉంటుందని వెల్లడించింది. అవసరమైతే భాగ్యనగర్ బంద్‌కు పిలుపునిస్తామని ఉత్సవసమితి హెచ్చరించింది.

ఇదీ జరిగింది...

సాగర్‌లో నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు విధించింది. హుస్సేన్‌ సాగర్‌లో గణేశ్‌, దుర్గాదేవి విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని కోరుతూ న్యాయవాది మామిడి వేణుమాధవ్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ టి.వినోద్‌ కుమార్‌ ధర్మాసనం తీర్పు వెలువరించింది. హుస్సేన్‌ సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలను వివిధ ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసిన 25 కుంటల్లో నిమజ్జనం చేయాలని స్పష్టం చేసింది. 

సుప్రీం తీర్పే కీలకం

కృత్రిమ రంగులు లేని ఇతర విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేయడానికి ధర్మాసనం అనుమతిచ్చింది. అయితే... ట్యాంక్‌ బండ్‌ వైపు విగ్రహాల నిమజ్జనం చేయవద్దని స్పష్టం చేసిన హైకోర్టు.. పీవీ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్‌, సంజీవయ్య పార్క్‌ వైపు నుంచి చేసుకోవచ్చని తెలిపింది. సాగర్‌లో ప్రత్యేక రబ్బర్‌ డ్యామ్‌ ఏర్పాటు చేసి.. అందులో నిమజ్జనం చేయాలని పేర్కొంది. వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ ప్రభుత్వ చేసిన విజ్ఞప్తిని ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. తమ ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే సుప్రీం కోర్టులో సవాలు చేసుకోవచ్చని సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.

ఇదీ చూడండి:

Last Updated : Sep 15, 2021, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.