ETV Bharat / city

ఏపీలో అమానుషం.. అప్పు తీర్చలేదని యువకుడికి శిరోముండనం - beheading a young man who has not paid his debt in west Godavari ap

తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని ఓ యువకుడికి శిరోముండనం చేయించిన అమానుష ఘటన ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

tonsured dalit head at janagareddy gudem
ఏపీలో మరో శిరోముండనం ఘటన.. అప్పు తిరిగి చెల్లించలేదని..
author img

By

Published : Oct 5, 2020, 12:16 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో జరిగిన శిరోముండనం ఘటన మరవకముందే మరో ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తీసుకున్న అప్పు తీర్చలేదంటూ ఓ యువకుడిని కారులో బలవంతగా తీసుకెళ్లి శిరోముండనం చేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం ఎస్సై కుటుంబరావు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని తాడేపల్లిగూడేనికి చెందిన అలక అభిలాశ్​‌(23) జంగారెడ్డిగూడేనికి చెందిన యర్రసాని విజయ్‌బాబు వద్ద మూడు నెలల క్రితం రూ.30 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఈ బాకీని తీర్చాలంటూ విజయ్‌బాబు గత మూడు రోజులుగా అభిలాష్‌ని అడుగుతున్నాడు.

ఏపీలో మరో శిరోముండనం ఘటన.. అప్పు తిరిగి చెల్లించలేదని..

ఇదే విషయమై అక్టోబర్‌ 3వ తేదీన రాత్రి విజయ్‌బాబు, తన మిత్రులు షేక్‌ నాగూల్‌ మీరావళి, కంకిరెడ్డి మార్కేండేయులతో కలిసి తాడేపల్లిగూడెంలోని అభిలాష్‌ ఇంటికి వెళ్లారు. అక్కడ నుంచి అభిలాష్‌ను కారులో ఎక్కించుకుని నేరగా జంగారెడ్డిగూడెం బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీకి తీసుకువచ్చి ఓ ఇంట్లో ఉంచారు. తీసుకున్న అప్పు తీర్చలేకపోవడంతో మరో వ్యక్తితో అభిలాశ్​కు శిరోముండనం చేయించారు. అనంతరం బాధితుడిని స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు. అనంతరం అభిలాశ్​‌ పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేశారు.

ఇదీచదవండి: పిల్లల అల్లరికి అడ్డుకట్ట వేయడమెలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.