BEAR HULCHAL: ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలకేంద్రంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. బస్టాండ్‌కు ఆనుకుని ఉన్న కొండపై ఉదయం నుంచి సంచరిస్తుంది. ఎలుగుబంటి సంచారంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. కొండకు అనుకొని నివాస గృహాలు ఉండటంతో.. ఏ సమయంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అటవీ అధికారులు చొరవ చూపి వన్యప్రాణుల దాడుల నుంచి రక్షించాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: