ETV Bharat / city

'బీసీ ఉద్యమానికి ఉద్యోగులు నాయకత్వం వహించాలి' - జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకుడు ఆర్. కృష్ణయ్య

హైదరాబాద్ కాచిగూడలో బీసీ ఉద్యోగుల సంఘ కార్యవర్గం సమావేశమైంది. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని.. డిమాండ్ చేశారు. బీసీ ఉద్యమానికి ఉద్యోగులు నాయకత్వం వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకుడు ఆర్. కృష్ణయ్య కోరారు.

BC Employees Union Working Committee Meeting at Kachiguda

author img

By

Published : Feb 28, 2022, 4:34 AM IST

బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని.. బీసీ ఉద్యోగుల సంఘం కార్యవర్గం డిమాండ్ చేసింది. బీసీలకు రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ తొలగించాలని కోరుతూ.. హైదరాబాద్ కాచిగూడలో బీసీ ఉద్యోగుల సంఘం కార్యవర్గం సమావేశమైంది. ఈ సమావేశానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకుడు ఆర్. కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో... రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని ఆర్‌. కృష్ణయ్య స్పష్టం చేశారు. బీసీ ఉద్యమానికి ఉద్యోగులు నాయకత్వం వహించాలని ఆయన కోరారు.

ఉద్యమిస్తే సమస్యలు పరిష్కారం..

"ఉద్యోగులు ఐకమత్యంగా ఉద్యమిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టడానికి చట్టపరమైన, రాజ్యంగపరమైన, న్యాయపరమైన అవరోధాలు, అడ్డంకులు ఏమీలేవు. ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి. క్రిమిలేయర్ నిబంధన తొలగించాలి. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలి. బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై బీసీ ఉద్యోగులు స్పందించాలి. బీసీ ఉద్యమానికి ఉద్యోగులు నాయకత్వం వహించాలి." - ఆర్​. కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకుడు

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.