ETV Bharat / city

BANDI SANJAY: 'కాళోజీ హెల్త్​ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యను పరిశీలిస్తామన్నారు' - bandi sanjay news

కాళోజీ విశ్వవిద్యాలయం విద్యార్థుల సమస్యపై (kaloji university mbbs students issues)బండి సంజయ్​ రాసిన లేఖకు ప్రతిస్పందన వచ్చింది. సమస్యను పరిశీలిస్తామని కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయ చెప్పారని.. సంజయ్​ తెలిపారు.

BANDI SANJAY
BANDI SANJAY
author img

By

Published : Oct 5, 2021, 7:26 PM IST

కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యను పరిశీలిస్తామని కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయ.. హామీ ఇచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ తెలిపారు. ఈ మేరకు లేఖ రాశారని పేర్కొన్నారు.

BANDI SANJAY
బండి సంజయ్​కు లేఖ రాసిన కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి

తమను ప్రమోట్​ చేసేందుకు సహకరించాలని.. విద్యాసంవత్సరం వృథా కాకుండా చూడాలని కాళోజీ హెల్త్​​ యూనివర్సిటీ ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు బండి సంజయ్‌ను కోరారు. కరోనా వేళ పాఠ్యాంశాలపై దృష్టి కేంద్రీకరించలేకపోవడం వల్ల ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరంలో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిలయ్యామని, తమను రెండో ఏడాదికి ప్రమోట్​ చేయకపోతే విద్యాసంవత్సరం వృథా అవుతుందంటూ.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బండి సంజయ్​కు విజ్ఞప్తి చేశారు. తమకు అవకాశం ఇస్తే తొలి ఏడాది ఫెయిలయిన సబ్జెక్టులను రెండో సంవత్సరంలో క్లియర్​ చేసుకుంటామని సంజయ్​ దృష్టికి తీసుకువచ్చారు.

దీనిపై సెప్టెంబర్ 9న కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రికి బండి సంజయ్​ లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన కేంద్రమంత్రి.. కాళోజీ వర్సిటీ విద్యార్థుల సమస్యను పరిశీలిస్తామంటూ బండి సంజయ్​కు ప్రత్యుత్తరం రాశారు.

ఇదీచూడండి: MBBS‌ Admissions 2021: గతేడాది 1,71,264 ర్యాంకుకు ఆఖరి సీటు.. మరి ఇప్పుడు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.