జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. పొత్తుల విషయంలో వారితో తాము ఎప్పుడూ చర్చించలేదన్నారు. వారికి ఏమైనా ఇబ్బంది ఉంటే.. కేంద్ర నాయకత్వం, తన దృష్టికి తీసుకురావాల్సిందని అభిప్రాయపడ్డారు. రెండు మూడు రోజుల ముందే కొన్ని విషయాలపై పవన్ కళ్యాణ్ అనుచరులతో మాట్లాడామన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన.. తెరాసకు మద్దతు ప్రకటించడం కొంచెం బాధ అనిపించిందని సంజయ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వ్యతిరేకించి ఇవాళ మద్దతు ప్రకటించడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఏ ఇబ్బంది ఉన్నా తటస్థంగా ఉంటే బాగుండేదని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. మొన్న వ్యతిరేకించిన పార్టీకి ఇవాళ మద్దతు ప్రకటించడం వల్ల ప్రజల్లో అయోమయం వస్తోందన్నారు.
ఇవీచూడండి: తెలంగాణ భాజపాపై పవన్ కల్యాణ్ గుస్సా