ETV Bharat / city

Bandi Sanjay Request to NRIs : 'తెరాసపై భాజపా పోరాటానికి మద్దతుగా నిలవండి' - తెరాసపై బండి సంజయ్ వ్యాఖ్యలు

Bandi Sanjay Request to NRIs : తెరాస నియంతృత్వ పాలనపై.. తెలంగాణ ప్రజల విముక్తికై భాజపా చేస్తున్న మహోద్యమానికి మద్దతుగా నిలవాలని ప్రవాస భారతీయులను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా పోరాడుతున్న తమ పోరాటంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

Bandi Sanjay Request to NRIs
Bandi Sanjay Request to NRIs
author img

By

Published : Mar 28, 2022, 2:55 PM IST

Bandi Sanjay Request to NRIs : భాజపా చేస్తున్న మహోద్యమంలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. కేసీఆర్ నియంత పాలనలో తెలంగాణ తల్లడిల్లుతోందని వాపోయారు. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే భాజపా లక్ష్యమని స్పష్టం చేశారు. అమెరికాలోని ప్రవాస భారతీయులు ఏక్ దక్కా- తెలంగాణ పక్కా అనే అంశంపై నిర్వహించిన జూమ్ సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు.

Bandi Sanjay Talks to NRIs : "రాష్ట్రంలో తెరాస అవినీతి పాలన నడుస్తోంది. కేసీఆర్ కుటుంబ రాజకీయాలు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్నాయి. తెరాస పాలనలో తెలంగాణ ప్రజలు తల్లడిల్లుతున్నారు. వారి కోసమే భాజపా న్యాయ పోరాటం చేస్తోంది. కేసీఆర్ నియంత పాలన నుంచి విముక్తి కోసం అహర్నిశలు కాషాయ జెండా పోరాడుతోంది. ఈ పోరాటంలో మాకు మీ మద్దతు కావాలి. పరాయి దేశంలో ఉన్నా.. మాతృభూమి గురించి ఆలోచించే మీరంతా భాజపాకు అండగా నిలవాలి."

- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

Bandi Sanjay Fires on CM KCR : గడీల్లో బంధీ అయిన తెలంగాణ తల్లిని కాపాడి.. మాతృభూమి రుణం తీర్చుకోవాలని ఎన్‌ఆర్‌ఐలను బండి సంజయ్ కోరారు. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేసి తీరతామని అన్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతి నియంత పాలన నిర్మూలనే లక్ష్యంగా యుద్ధం చేస్తున్నామని తెలిపారు. తెరాస నేతల అవినీతి బండారంపై న్యాయ పోరాటం చేస్తున్నామని వెల్లడించారు. భాజపా పోరాటానికి ప్రవాస భారతీయులు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.