Bandi Sanjay fire on CM Kcr: భారత్‌ను 2040 నాటికి ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు పీఎఫ్ఐ కుట్ర పన్నిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఎల్‌బీనగర్‌లో ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. పీఎఫ్ఐ వంటి ఉగ్రవాద సంస్థల్ని.. తెరాస, ఎంఐఎం పెంచి పోషిస్తున్నాయని విమర్శించారు. జిమ్, స్వచ్ఛంద సంస్థల పేరుతో పీఎఫ్ఐ విస్తరిస్తోందని పాదయాత్రలో నిప్పులు చెరిగారు.
హిందువుల తలలు నరుకుతున్న పీఎఫ్ఐ సంస్థ తెలంగాణలో విస్తరిస్తుంటే సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. ఎన్ఐఏ వచ్చి సోదాలు జరిపే వరకు పీఎఫ్ఐ గురించి సర్కార్‌కు సోయి ఎందుకు లేదన్నారు. ఎంఐఎం ఆగడాలను అడ్డుకునేది భాజపా మాత్రమేనన్నారు. ఏ స్కాం బయటపడినా.. కేసీఆర్ కుటుంబం పాత్ర ఉంటుందని బండి సంజయ్ ఆరోపించారు. కొడుకు, బిడ్డ తప్పు చేసినా జైల్లో పెడతానన్న కేసీఆర్... దిల్లీ లిక్కర్ కుంభకోణంపై ఎందుకు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. సీబీఐ, ఈడీ దాడులు చూసి.. క్వారంటైన్‌కు పోతున్నారని ఎద్దేవా చేశారు.
'ఏ కుంభకోణం బయటపడినా అందులో కేసీఆర్ కుటుంబం పాత్ర ఉంటోంది. పీఎఫ్‌ఐ వంటి ఉగ్రవాద సంస్థల్ని తెరాస, మజ్లిస్ పెంచి పోషిస్తున్నాయి. ఎన్ఐఏ సోదాలు జరిపేదాకా పీఎఫ్ఐ గురించి తెలియదా?ఎంఐఎం ఆగడాలను అడ్డుకునేది భాజపా మాత్రమే. ప్రశ్నిస్తున్న కార్పొరేటర్లను అరెస్టు చేసి జైళ్లో పెడతారా? దిల్లీ మద్యం కుంభకోణంపై కేసీఆర్ ఎందుకు నోరుమెదపడం లేదు. సీబీఐ, ఈడీ దాడులు చూసి క్వారంటైన్‌కు పోతున్నారు.'-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి: