నిజామాబాద్‌లో 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ తెలిపారు. ఇక్కడ బ్యాలెట్ ద్వారానే పోలింగ్ జరపనున్నట్లు ప్రకటించారు. రిటర్నింగ్ అధికారి నుంచి ఫారం 7ఏ వచ్చాక ఈసీకి తెలియజేస్తామని అన్నారు. నమూనాను ఈసీ సూచిస్తుందని... దాని ప్రకారమే బ్యాలెట్ పత్రాలు ముద్రిస్తామని తెలిపారు. నిజామాబాద్‌కు సంబంధించిన అన్ని అంశాలను ఈసీకి దృష్టికి తీసుకెళ్తామన్నారు. బ్యాలెట్ పత్రాలకు సరిపడా బ్యాలెట్ బాక్సులను సేకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బ్యాలెట్ పత్రాల ముద్రణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:నేను ఎప్పటికీ ప్రజాపక్షమే: గద్దర్