ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా దర్శనం ఇచ్చిన అమ్మవారు.. రెండోరోజైన నేడు బాలా త్రిపురసుందరీ దేవిగా కొలువుదీరారు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు.
వృద్ధులు, దివ్వాంగులకు నేటి నుంచి దర్శనానికి ప్రత్యేక సమయాన్ని ఆలయ కమిటీ కేటాయించింది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దర్శనాన్ని కేటాయించారు. అక్టోబర్ 2న మినహా ఇతర రోజుల్లో వృద్ధులు, దివ్యాంగులకు దర్శనం కల్పించనున్నారు.
ఇవీ చదవండి:
రెండోరోజూ ఉత్సాహంగా సాగిన బతుకమ్మ వేడుకలు..
ప్రభుత్వ ఆఫీసులో సామానంతా అమ్మేసిన ప్యూన్.. తలుపులు, కిటికీలు కూడా.. మందు కోసమే!