Balakrishna about NTR: నవరస నటనా సార్వభౌముడు, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 26వ వర్ధంతిని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించారు. ఆస్పత్రి ఆవరణలోని నందమూరి బసవతారకం రామారావు విగ్రహాలకు ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా.ఫణికోటేశ్వరరావు, అసోసియేట్ డైరెక్టర్ డా.కల్పనా రఘునాథ్, మెడికల్ ఆంకాలజీ విభాగం అధిపతి డా.సెంథిల్ రాజప్ప, రేడియాలజీ విభాగాధిపతి డా.వీరయ్య చౌదరి సహా పలువురు వైద్యులు, వైద్యేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైద్యులు, సిబ్బందికి ప్రశంసలు..
క్యాన్సర్తో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తన తండ్రి ఈ ఆస్పత్రిని నిర్మించినట్టు బాలకృష్ణ తెలిపారు. కరోనా కాలంలో కూడా క్యాన్సర్ రోగులకు ఇబ్బందులు ఎదురుకాకుండా వైద్యులు, వైద్యేతర సిబ్బంది ఎంతో ధైర్యంగా చికిత్స అందించారని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ తన తండ్రి ఆశయాలకు తగినట్లుగా సంస్థను ముందుకు నడిపిస్తామని బాలకృష్ణ హామీ ఇచ్చారు. ఒమిక్రాన్ విజృంభిస్తున్ననేపథ్యంలో మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రజలందరూ ప్రభుత్వాలు సూచించిన మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: