హైదరాబాద్ సంస్కృతి, సంప్రదాయానికి అద్దం పట్టే సదర్ సంబురానికి జంట నగరాలు ముస్తాబయ్యాయి. డప్పు దరువులు, విన్యాసాలతో సాగే ఊరేగింపు కోసం బస్తీలన్నీ సిద్ధమయ్యాయి. ఈ ఏడాది నిర్వహించే సదర్ ఉత్సవాలల్లో బహబలి దున్నరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలవునుంది.
హైదరాబాద్ కాచిగూడలో బహుబలి దున్నరాజు సందడి చేసింది. దీనిని చూసేందుకు నగరవాసులు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రపంచంలోనే అతి ఎత్తైనది బహుబలి దున్నరాజని అఖిలభారత యాదవ మహాసభ నేత చిట్టబోయిన సందీప్ యాదవ్ తెలిపారు. కులమతాలకు అతీతంగా నిర్వహించే ఈ వేడుకల్లో ప్రజలందరూ పాల్గొనాలని అఖిలభారత యాదవ మహాసభ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కార్యదర్శి చిట్టబోయిన లడ్డు యాదవ్ కోరారు.
కొవిడ్ కారణంగా గత సంవత్సరం సదర్ ఉత్సవాలను నిర్వహించలేదు. రైతులు, పాడి సంపదను నమ్ముకున్న ప్రతి ఒక్కరు చల్లగా ఉండాలని లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ సదర్ ఉత్సవాలను నిజాం కాలం నుంచి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవాలతో హైదరాబాద్ నగరానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించిందన్నారు.
ఇదీచూడండి: Sadar Celebrations 2021: సదర్‌లో ప్రత్యేక ఆకర్షణగా షారూక్..