ETV Bharat / city

హిమాచల్​ప్రదేశ్ గవర్నర్​ను కలిసిన సైనా దంపతులు - హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్​ బండారుదత్తాత్రేయ

హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయను బాడ్మింటన్​ క్రీడాకారులు సైనానెహ్వాల్, పారుపల్లి కశ్యప్ మర్యాదపూర్వకంగా కలిశారు. సిమ్లాలోని రాజ్​భవన్​లో కలిసి ఆయనకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. హిమాచల్ సంప్రదాయం ప్రకారం గవర్నర్ సైనా దంపతులను సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

Badminton player saina nehwal couples meet himachalpradesh governer bandaru dattatreya
హిమాచల్​ప్రదేశ్ గవర్నర్​ను కలిసిన సైనా దంపతులు
author img

By

Published : Nov 15, 2020, 10:49 PM IST

బ్యాడ్మింటన్​ క్రీడాకారులు సైనా నెహ్వాల్​, పారుపల్లి కశ్యప్ దంపతులు హిమాచల్​ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. సిమ్లాలోని రాజ్​భవన్​లో హిమాచల్​ సంప్రదాయం ప్రకారం సైనా దంపతులను టోపీ, శాలువతో సత్కరించారు. రాజ్​భవన్​ చిత్రపటాన్ని వారికి జ్ఞాపికగా గవర్నర్ అందజేశారు.

అంతర్జాతీయస్థాయిలో రాణిస్తున్నారు..

హిమాచల్​ప్రదేశ్ అందమైన పర్వత రాష్ట్రమని గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. హిమాచల్ యువత చాలా ప్రతిభావంతులని, అత్యుత్తమ ఆటగాళ్ల లక్షణాలు కలిగి ఉన్నారన్నారు. సరైన శిక్షణ, సౌకర్యాలు కల్పిస్తే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు హిమాచల్​ ప్రభుత్వం అనేక సదుపాయాలను కల్పిస్తోందని, గ్రామీణ స్థాయిలో క్రీడలకు మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందని వెల్లడించారు. హిమాచల్​ప్రదేశ్​లో క్రీడల కోసం అంతర్జాతీయస్థాయి సౌకర్యాలను అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు గవర్నర్ తెలిపారు.

బాడ్మింటన్​ అకాడమీ ఏర్పాటు చేస్తా..

హిమాచల్​ప్రదేశ్‌లో బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించడానికి తాను ఎంతో ఆసక్తిగా ఉన్నానని గవర్నర్​తో తన అభిప్రాయం వ్యక్తం చేశారు సైనా. ఉత్తర భారత ఆటగాళ్ల శిక్షణ కోసం హైదరాబాద్, బెంగళూరుకు వస్తుంటారని సైనా నెహ్వాల్ తెలిపారు. ధర్మశాలలోని క్రికెట్ స్టేడియంను ఆమె ప్రశంసిస్తూ చాలా మంది ఆటగాళ్లు జాతీయ స్థాయిలో గొప్పగా రాణిస్తున్నారని అన్నారు.

ఇదీ చూడండి:ధరణితోనే లావాదేవీలు.. ఏకకాలంలోనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.