Axis Bank Letter : కాలపరిమితి ముగిసిన విద్యుత్ బాండ్‌లకు ఏపీ, తెలంగాణ చెల్లింపులు చేయడం లేదని ఆయా రాష్ట్రాల గవర్నర్లు బిశ్వభూషణ్, తమిళసైకు యాక్సిస్ బ్యాంకు లేఖలు రాసింది. 2006లో జారీ చేసిన విద్యుత్ బాండ్‌లకు అప్పటి ప్రభుత్వం హామీ ఉందని.. తక్షణం జోక్యం చేసుకుని వడ్డీతో సహా బాండ్‌ల మొత్తాన్ని ఇప్పించాలని కోరింది. 2006లో జారీ చేసిన విద్యుత్ బాండ్‌లకు గతేడాది సెప్టెంబర్ 9 నాటికి గడవు ముగిసిందని.. అప్పటికి 156.70 కోట్ల మేర ఏపీ, తెలంగాణ డిస్కంలు చెల్లించాలని లేఖలో యాక్సిస్ బ్యాంకు కోరింది. పలుమార్లు సంప్రదింపుల అనంతరం 121 కోట్లు చెల్లించారని...ఇంకా 36 కోట్ల 70 లక్షలు రావాల్సి ఉందని వివరించింది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి తక్షణం చెల్లింపులు చేసేలా చూడాలని గవర్నర్లకు యాక్సిస్ బ్యాంకు విజ్ఞప్తి చేసింది.
Axis Bank : తెలుగు రాష్ట్రాల గవర్నర్లకు యాక్సిస్ బ్యాంక్ లేఖ - Axis Bank
Axis Bank Letter : తెలుగు రాష్ట్రాల గవర్నర్లకు యాక్సిస్ బ్యాంకు లేఖలు రాసింది. కాలపరిమితి ముగిసిన విద్యుత్ బాండ్‌లకు ఏపీ, తెలంగాణ చెల్లింపులు చేయడం లేదని ఆ లేఖలో పేర్కొంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి తక్షణం చెల్లింపులు చేసేలా చూడాలని గవర్నర్లకు యాక్సిస్ బ్యాంకు విజ్ఞప్తి చేసింది.