ETV Bharat / city

అసెంబ్లీని సందర్శించిన ఆస్ట్రియా బృందం... పలు కీలక వ్యాఖ్యలు

Austrian delegation visits Assembly: ఆస్ట్రియా, తెలంగాణ మధ్య చాలా విషయాలలో సారూప్యత ఉందని ఆస్ట్రియా నేషనల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఉల్ఫ్‌గాంగ్ సొబోట్కా అన్నారు. తమ పర్యటన ద్వారా ఉభయ దేశాల మధ్య సంబంధాలు దృఢంగా మారుతాయని తెలిపారు. శాసనసభకు వచ్చిన ఆస్ట్రియా బృందం సభ్యులు గ్యాలరీ ద్వారా అసెంబ్లీ సమావేశాల తీరును వీక్షించారు.

Austrian delegation visits Assembly
అసెంబ్లీని సందర్శించిన ఆస్ట్రియా బృందం
author img

By

Published : Mar 15, 2022, 4:49 PM IST

Austrian delegation visits Assembly: తమ పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు దృఢంగా అవుతాయని ఆస్ట్రియా నేషనల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఉల్ఫ్‌గాంగ్ సొబోట్కా అన్నారు. ఆర్థిక, సాంస్కృతిక, పర్యాటక రంగాలలో అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

రాష్ట్ర శాసనసభను ఆస్ట్రియా దేశ పార్లమెంటరీ డెలిగేషన్ టీం సభ్యులు, ఆస్ట్రియా నేషనల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఉల్ఫ్‌గాంగ్ సొబోట్కా, ఆస్ట్రియా ఫెడరల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ క్రిస్టినా స్వర్జ్ ఫచ్ నేతృత్వంలోని 17 మంది పార్లమెంట్ సభ్యులు సందర్శించారు. అసెంబ్లీకి వచ్చిన ఆస్ట్రియా బృందం సభ్యులు గ్యాలరీ ద్వారా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరును వీక్షించారు. అనంతరం శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో శాసనసభలోని కమిటీ హాల్​లో సమావేశమయ్యారు.

Austrian delegation visits Assembly
అసెంబ్లీని సందర్శించిన ఆస్ట్రియా బృందం

దేశ పార్లమెంటరీ వ్యవస్థ మాదిరిగా...

హైదరాబాద్ 400 ఏళ్ల పైగా చరిత్ర గల నగరమని.. దేశ పార్లమెంటరీ వ్యవస్థ లాగానే... తెలంగాణ రెండు చట్టసభలు(శాసనసభ, శాసనమండలి) కలిగి ఉందని స్పీకర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ అభివృద్ధి, సంక్షేమ రంగాలలో దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ముందంజలో ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డెలిగేషన్ సభ్యులను శాలువా, మెమెంటోలతో శాసనసభాపతి, మండలి ఛైర్మన్ సన్మానించారు.

ఇదీ చదవండి:Sugar Farmers protest: అసెంబ్లీ ముట్టడికి రైతుల యత్నం.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.