ETV Bharat / city

కలిసి మద్యం తాగారు... కత్తితో దాడి చేసుకున్నారు - today crime news

ఇద్దరు మిత్రులు మద్యం తాగారు. సరదగా గడిపారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం... చివరకు కత్తితో దాడి చేసే వరకు వెళ్లింది. ఈ ఘటన అంబర్​పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

attack-with-knife-in-amberpet
కలిసి తాగారు... కత్తితో దాడి చేసుకున్నారు
author img

By

Published : Jul 19, 2020, 10:01 AM IST

అంబర్​పేట్​లోని బాపునగర్​కు చెందిన షేక్ రియాజ్, ఫైజల్ మిత్రులు. ఇద్దరు కలిసి సరదగా గడుపుతూ మందు తాగారు. తాగిన మైకంలో వీరి మధ్య మాట మాట పెరిగింది. అనంతరం ఇద్దరు నియంత్రణ కోల్పోయారు. కోపోద్రిక్తుడైన ఫైజల్... రియాజ్​పై కత్తితో దాడి చేశాడు. మెడకు తీవ్రగాయం కావడంతో స్థానికులు రియాజ్​ను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేశ్ కుమార్ తెలిపారు.

ఇవీ చూడండి: 'ఒక్కసారి మా నాన్నను చూడనివ్వండి.. ప్లీజ్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.