హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పాత్రికేయుల సమావేశం నిర్వహించడానికి వచ్చిన కొందరు వ్యక్తులపై ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్ధి తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. తెలంగాణ గురుకులాల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని, గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై ఆరోపణలు చేస్తూ... జాతీయ ఎస్‌సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కర్నె శ్రీశైలం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం కొనసాగుతుండగా... ఉస్మానియా విద్యార్ధి అలెగ్జాండర్ తన అనుచరులతో కలిసి ఒక్కసారిగా శ్రీశైలం పై దాడికి దిగాడు. అడ్డుకోబోయిన కొందరు పాత్రికేయులపైన విద్యార్ధులు దౌర్జన్యం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రెస్‌క్లబ్‌కు చేరుకుని దాడి చేసిన విద్యార్ధులను అదుపులోకి తీసుకున్నారు. తనపై దాడి చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశాడు.
ఇవీ చూడండి: శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్