బల్దియా ఎన్నికలకు శుక్రవారం నామినేషన్ల ఘట్టం ముగిసింది. ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్రులు నామపత్రాలు సమర్పించారు. మేయర్ బొంతు రామ్మోహన్(రూ.39,53,340) కంటే ఆయన సతీమణి బొంతు శ్రీదేవికే ఎక్కువ ఆస్తులున్నాయి. పీజేఆర్ వారసురాలు విజయారెడ్డి రూ.23,84,92,000 ఆస్తులతో కార్పొరేటర్ అభ్యర్థుల్లో ముందు వరుసలో నిలిచారు. తెదేపా రాజేంద్రనగర్ అభ్యర్థి రోజా పేరిట ఎలాంటి ఆస్తులు లేకపోవడం గమనార్హం.
బల్దియా పోరులో సంపన్నులు.. సామాన్యులు - ghmc elections 2020
2020 బల్దియా బరిలో నిలిచిన వారిలో సంపన్నులు.. సామాన్యులు ఉన్నారు. కోట్లకు పడగలెత్తిన వ్యాపార కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అభ్యర్థులు, ఉన్నత చదువులు, ఉత్తమ ఆశయాలతో రాజకీయంలోకి అడుగుపెట్టిన మరికొందరు బరిలో నిలిచారు.
![బల్దియా పోరులో సంపన్నులు.. సామాన్యులు Assets of GHMC Election Candidates 2020](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9622966-985-9622966-1606017422661.jpg?imwidth=3840)
బల్దియా పోరులో సంపన్నులు.. సామాన్యులు