ETV Bharat / city

కొత్త పుర చట్టంలో పట్టణ ప్రజలకు వరాలు

పట్టణ పేదలు 75 గజాల లోపు జీప్లస్ వన్ ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకోవాల్సిన అవసరంలేదని సీఎం కేసీఆర్​ అసెంబ్లీలో స్పష్టం చేశారు. కొత్త పురపాలక ముసాయిదా బిల్లు ముఖ్య ఉద్దేశం, కారణాలను సభ్యులకు ముఖ్యమంత్రి వివరించారు. అనంతరం విపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఆతర్వాత బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.

assembly
author img

By

Published : Jul 19, 2019, 8:18 PM IST

కొత్త పుర చట్టంలో పట్టణ ప్రజలకు వరాలు

గ్రామస్వరాజ్యం కోసం మహాత్మాగాంధీ ఎంతగానో తపన పడ్డారని ముఖ్యమంత్రి కేసీఆర్​ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. పంచాయతీ వ్యవస్థ ఒక విభాగం కాదు... ఉద్యమమని స్పష్టంచేశారు. అవినీతిరహిత పాలన కోసం నూతన పురపాలక చట్టం తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. చట్టం ప్రాముఖ్యతను సభ్యులకు సీఎం తెలియజేశారు. అనంతరం బిల్లుపై అభిప్రాయాలు తెలిపిన సభ్యులకు ధన్యవాదాలు చెప్పి పశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈసందర్భంగా కాంగ్రెస్​ వైఖరిపై మండిపడ్డారు. కలెక్టర్‌ వ్యవస్థను కించపరిచేలా సూచనలు చేయడం సరికాదన్నారు.

కలెక్టర్లకు నియంత్రణ మాత్రమే

కొత్త చట్టంలో జిల్లా కలెక్టర్లు మరింత కీలకం కానున్నారని, పని చేయని సర్పంచ్‌లు, ఛైర్‌పర్సన్లు, వార్డుమెంబర్లు, కౌన్సిలర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలోని ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం ఇళ్లకు సంబంధించిన కొలతలు చేపడుతుందని స్పష్టం చేశారు. కలెక్టర్‌ తీసుకున్న చర్యలపై స్టే ఇచ్చే అధికారాన్ని మంత్రి నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు. హరితహారం లక్ష్యాలు పూర్తి చేయని ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాదర్బార్‌ ద్వారా పోడుభూముల సమస్యను పరిష్కరిస్తామని కేసీఆర్‌ అన్నారు.

ఇక నోటిసులు ఉండవు... కూలగొట్టుడే

అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసు ఇవ్వకుండానే కూల్చివేస్తామని సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. అక్రమ కట్టడాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదిలేదన్నారు. పట్టణాల్లో పేదలు 75 గజాల లోపు జీప్లస్​ వన్​ ఇంటి నిర్మాణానికి అనుమతి అవసరంలేదని తీపి కబురు చెప్పారు. రిజిస్ట్రేషన్​ ఫీజు ఒక్క రూపాయిగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇంటికి పన్ను ఏడాదికి రూ.100 మాత్రమే అన్నారు. 500 చదరపు గజాల వరకు నిర్ణీత సమయంలో ఆన్‌లైన్‌లోనే అనుమతి వస్తుందన్నారు. యజమానులే ఇంటి నిర్మాణానికి సంబంధించిన సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ ఇవ్వాలని తెలిపారు. తప్పుడు సర్టిఫికేషన్‌ ఇస్తే 25 రెట్లు జరిమానా విధిస్తామన్నారు. కొత్త డోర్‌ నంబర్లు ఇస్తున్నామని, రాష్ట్రంలో ప్రతి ఇంటికి డోర్‌ నంబర్‌ కచ్చితంగా ఉండాలని వెల్లడించారు.

'ఎన్నికల తేదీని ప్రభుత్వమే నిర్ణయిస్తుంది'

ఎన్నికల కమిషన్‌ ఓ స్వతంత్ర సంస్థ అని సీఎం వ్యాఖ్యానించారు. పురపాలిక ఎన్నికల తేదీలను నిర్ణయించే అధికారం మాత్రం ప్రభుత్వానికే ఉందన్నారు. ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘానికి పూర్తి స్వేచ్ఛ ఉందని చెప్పారు. ఈసీ విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని తెలిపారు.
కలెక్టర్ల చేతిలో నియంత్రణ మాత్రమే పెట్టామని... వారికి పూర్తి అధికారాలు ఇవ్వలేదన్నారు ముఖ్యమంత్రి​. ప్రజాప్రతినిధులందరూ కచ్చితంగా శిక్షణ పొందాలని సూచించారు. ఆగస్టు 15 నుంచి రియల్‌ టైం పరిపాలన సంస్కరణలు అమలు చేస్తామన్నారు.

ఇదీ చూడండి: కొత్త పురపాలక చట్ట ముసాయిదా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.