ETV Bharat / city

రోగులతో కిటకిటలాడుతున్న ప్రభుత్వ ఆస్పత్రులు

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు ఐదో రోజు కూడా నిలిచిపోయాయి. డబ్బు కట్టి వైద్యం చేయించుకునే స్తోమత లేని పేదలు సర్కారు ఆస్పత్రుల బాట పడుతున్నారు. అసలే జ్వరాలు ప్రభలే సమయం కావటం వల్ల భాగ్యనగరంలోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వాసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.

aryogya sri
author img

By

Published : Aug 20, 2019, 11:04 PM IST

ప్రైవేటులో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిన పుణ్యమా అని.... రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై గతంలో ఎన్నడూ లేనంతగా భారం పడుతోంది. అసలే అరకొర సిబ్బందితో వైద్య సేవలు అందిస్తున్న సర్కారు దవాఖానాలకు ఇప్పుడు మూలిగే నక్కపై తాడిపండు పడినట్లు అయ్యింది. అసలే జ్వరాలు ప్రభలే సమయం కావటం వల్ల భాగ్యనగరంలోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.

రోగులతో కిటకిటలాడుతున్న ప్రభుత్వ ఆస్పత్రులు

నిన్న ఒక్క రోజే గాంధీ ఆస్పత్రికి సుమారు 2500 మందికి పైగా రోగులు వచ్చారు. సుమారు నాలుగు గంటలకు పైగా క్యూలో నిల్చోవాల్సిన దుస్థితి. అత్యవసర పరిస్థితిలో ఉన్నవారికి ప్రాణ రక్షణ కరువైంది. జిల్లాల నుంచి వచ్చిన వారికి సరైన వైద్యం అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా డయాలసిస్ రోగుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారుతోంది. ఒక్కో డయాలసిస్​కి 3 నుంచి ఐదు వేల రూపాయలు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్న 11 కౌంటర్లతోపాటు... మరో ఐదు కౌంటర్లు నూతనంగా ఏర్పాటు చేసి.... ఎప్పుడు రోగులు వచ్చినా తక్షణం వారికి సేవలు అందిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పష్టం చేశారు.

విఫలమైన చర్చలు...

2007లో ఆరోగ్య శ్రీ వచ్చిన తర్వాత నుంచి పేదలకు కొంతమేరకు మెరుగైన వైద్యం అందుతోంది. దాదాపు 240 ఆస్పత్రుల్లో సుమారు వెయ్యికి పైగా వ్యాధులకు ఆరోగ్య శ్రీలో చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం పెండింగ్ బకాయిలను చెల్లించటం లేదంటూ నెట్ వర్క్ ఆస్పత్రులు సేవలను నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఓ మారు ఆస్పత్రుల ప్రతినిధులతో చర్చలు జరిపినప్పటికీ అవి విఫలమయ్యాయి. దీంతో సేవలు నిలిచి నేటికి ఐదు రోజులు పూర్తైంది. రాష్ట్ర వ్యాప్తంగా రోగులు ఎక్కడి కక్కడ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి... తమను ఆదుకోవాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చూడండి:మల్లన్నసాగర్​' అధికారులకు హైకోర్టు దెబ్బ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.