గణతంత్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు ఉదయం జరగనున్న ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సాయుధ బలగాల గౌరవవందనం స్వీకరిస్తారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కరోనా నేపథ్యంలో అందుకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రాజ్భవన్లో ఎట్హోం కార్యక్రమాన్ని జరపడం లేదు.
ఇవీచూడండి: 'సంస్కరణలపై అనుమానాలు సహజం- రైతు సంక్షేమమే ధ్యేయం'