ETV Bharat / city

భారత్ జోడో యాత్ర పర్యవేక్షణకు కమిటీల ఏర్పాటు.. - Monitoring Committees for Jodo Yatra

Bharat Jodo Yatra Monitoring Committees in Telangana: మరికొద్ది రోజుల్లో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించనుండటంతో పీసీసీ నేతలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రూట్‌ మ్యాప్‌ ఖారారు చేసిన పీసీసీ వర్గాలు.. జోడోయాత్ర విజయవంతం చేసేందుకు 13 రకాల పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేశాయి.

Rahul Gandhi Bharat Jodo Yatra
Rahul Gandhi Bharat Jodo Yatra
author img

By

Published : Oct 18, 2022, 8:50 PM IST

Bharat Jodo Yatra Monitoring Committees in Telangana: తెలంగాణలో భారత్ జోడో యాత్ర పర్యవేక్షణ నిమిత్తం తెలంగాణ పీసీసీ 13 రకాల కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో పార్టీ సీనియర్ నాయకులందరికీ భాగస్వామ్యం కల్పించింది. కమిటీల వివరాలను పీసీసీ ఆర్గనైజింగ్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్​కుమార్ గౌడ్ ప్రకటించారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రాష్ట్రంలోని ప్రజా సంఘాలను, మేధావులను, ఎన్జీవోలను రాహుల్ గాంధీతో సమన్వయం కోసం ఎంపీ ఉత్తమ్​కుమార్ రెడ్డి నేతృత్వంలో కమిటీ వేశారు.

జోడో యాత్రకు విస్తృతంగా ప్రచారం కల్పించేందుకు పబ్లిసిటీ కమిటీ ఛైర్మన్​గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను నియమించారు. జోడో యాత్రను సమన్వయం చేయడం కోసం సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే దుద్దిర్ల శ్రీధర్ బాబును నియమించారు. యాత్ర పొడవునా అన్ని నియోజకవర్గాల్లో చిన్న చిన్న సమావేశాల నిర్వహణ, కార్నర్ మీటింగ్‌ల కమిటీకి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఛైర్మన్​గా ఉన్నారు.

ఇక ఫుడ్ కమిటీకి మాజీ మంత్రి షబ్బీర్ అలీ, జన సమీకరణ కమిటీకి ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి, ప్రొటోకాల్ కమిటీకి మాజీ మంత్రి జి.వినోద్, మీడియా సమన్వయ కమిటీకి జట్టి కుసుమ కుమార్, మహిళల జన సమీకరణ సమన్వయ కమిటీకి ఎమ్మెల్యే సీతక్క, జోడో యాత్ర కో-ఆర్డినేటర్ కమిటీకి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సామాజిక మీడియా వ్యవహారాల కమిటీకి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, మౌలిక వసతుల కమిటీకి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఛైర్మన్‌గా ఉన్నారు. రిసెప్షన్ కమిటీలో ఏకంగా 41 మందితో వేసిన కమిటీకి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఛైర్మన్‌గా ఉన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.