ETV Bharat / city

IAF Chopper Crash: హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా వాసి మృతి

author img

By

Published : Dec 8, 2021, 7:04 PM IST

Updated : Dec 8, 2021, 7:51 PM IST

హెలికాప్టర్‌
హెలికాప్టర్‌

19:01 December 08

రక్షణశాఖలో లాన్స్‌ నాయక్‌గా ఉన్న సాయితేజ

హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా వాసి మృతి

IAF Chopper Crash: తమిళనాడులోని కూనురులో ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో ఏపీకి చెందిన వ్యక్తి కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లా కురుబలకోట మండలం ఎగువరేగడ గ్రామవాసి సాయితేజ్‌ ఈ ప్రమాదంలో మృతి చెందారు. లాన్స్‌ నాయక్​​గా ఉన్న సాయితేజ్‌.. సీడీఎస్ బిపిన్ రావత్​కు వ్యక్తిగత భద్రతాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఆర్మీ సిఫాయిగా చేరి..

సాయితేజ్.. 2013లో ఆర్మీలో జవానుగా చేరారు. ఏడాది తర్వాత పారా కమెండో శిక్షణ పూర్తి చేసుకున్నాడు. స్పెషల్ ఫోర్సెస్​ 11 పారా విభాగంలో లాన్స్ నాయక్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. బెంగళూరులో సైనికులకు శిక్షకుడుగా పని చేసిన సాయితేజ్.. ప్రస్తుతం బిపిన్ రావత్ వ్యక్తిగత భద్రతలో విధులు నిర్వర్తిస్తున్నారు. సాయితేజ్​కు భార్య శ్యామల, కుమారుడు మోక్షజ్ఞ, కూతురు దర్శిని ఉన్నారు. వీరి కుటుంబం గత ఏడాదిగా మదనపల్లె ఎస్​బీఐ కాలనీలో నివాసం ఉంటోంది. ఇవాళ ఉదయం 8:15కు సాయితేజ్ ఓసారి ఫోన్ చేశారని.. 8:45 వీడియో కాల్ చేసి పిల్లలతో మాట్లాడారని కుటుంబసభ్యులు తెలిపారు. సాయితేజ్ మరణంతో.. గ్రామంలో విషాదం నెలకొన్నాయి.

హెలికాప్టర్ ఘటన.. ఏం జరిగిందంటే

Bipin Rawat passed away: హెలికాప్టర్​ ప్రమాదంలో త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఆయన ప్రయాణిస్తున్న Mi-17V5 చాపర్​ బుధవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం 14 మందికిగానూ 13 మంది చనిపోయినట్లు వాయుసేన ప్రకటించింది.

లెక్చర్​​ ఇచ్చేందుకు వెళ్లి..

కోయంబత్తూర్​ సమీపంలోని సూలూర్​ వైమానిక స్థావరం నుంచి బయల్దేరిన Mi-17V5 చాపర్​.. కూనూర్​ సమీపంలోని కట్టేరి- నాంచప్పనంచథ్రం వద్ద మధ్యాహ్నం 12.20-12.30 గంటల ప్రాంతంలో కూలిపోయింది. జనరల్​ రావత్​.. వెల్లింగ్టన్​లోని డిఫెన్స్​ స్టాఫ్​ కాలేజ్​లో లెక్చర్​ ఇచ్చేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. పొగమంచుతో వెలుతురు సరిగా లేకపోవడమే.. ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. చాపర్​.. నివాస ప్రాంతాలకు కాస్త దూరంగా కూలిపోవడం వల్ల భారీ ప్రాణనష్టం తప్పింది. ఘటన సంబంధిత దృశ్యాలు.. భయానకంగా ఉన్నాయి. హెలికాప్టర్​ మంటల్లో పూర్తిగా కాలిపోయింది.

బిపిన్ రావత్ మృతిపట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తో పాటు రాజ్​నాథ్ సింగ్, రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. రావత్ సేవలను గుర్తు చేసుకున్నారు.

ఇవీ చూడండి:

Last Updated : Dec 8, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.