ఎర్రమంజిల్‌లో భవనం కూల్చివేతపై విచారణ జులై 8కి వాయిదా పడింది. వారసత్వ చారిత్రాత్మక కట్టడమైన ఎర్రమంజిల్ భవనం కూల్చివేత సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు. నూతన శాసనసభ నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని అన్నారు. ఎర్రమంజిల్ భవనం చారిత్రాత్మక కట్టడాల జాబితాలోకి రాదని అదనపు ఏజీ కోర్టుకు తెలిపారు. నూతన శాసనసభ భవన నిర్మాణ నమూనాను సమర్పించాలని అదనపు ఏజీని ధర్మాసనం ఆదేశించింది. సచివాలయం, నూతన శాసనసభ నిర్మాణాన్ని సవాల్ చేస్తూ వేర్వేరుగా ఆరు పిటిషన్‌లు దాఖలయ్యాయి.
అసెంబ్లీ నిర్మాణంపై విచారణ జులై 8కి వాయిదా - new-assembly-building
నూతన శాసనసభ నిర్మాణంపై హైకోర్టులో వాదనలు జులై 8కి వాయిదాపడ్డాయి.