ETV Bharat / city

Ex minister Narayana Bail Petition: 'ఎవరినీ ఒత్తిడి చేయలేదు.. అది కక్ష సాధింపే..'

Amaravati Case: ఏపీ రాజధాని అమరావతి మాస్టర్‌ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంటు విషయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో.. సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం నిందితులు వ్యాజ్యం దాఖలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈ వ్యాజ్యంపై తీర్పును వాయిదా వేశారు.

Ex minister Narayana Bail Petition: 'ఎవరినీ ఒత్తిడి చేయలేదు.. అది కక్ష సాధింపే..'
Ex minister Narayana Bail Petition: 'ఎవరినీ ఒత్తిడి చేయలేదు.. అది కక్ష సాధింపే..'
author img

By

Published : Jun 18, 2022, 11:04 AM IST

Ex minister Narayana Bail Petition: ఆంధ్రప్రదేశ్​ రాజధాని అమరావతి మాస్టర్‌ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంటు విషయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో.. సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్​ కోసం నిందితులు దాఖలు చేసిన వ్యాజ్యంపై తీర్పును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు వాయిదా వేశారు. మాజీ మంత్రి నారాయణ, రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ కె.పి.వి.అంజనీకుమార్‌, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్‌, ఆయన సోదరుడు లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్‌ దాఖలు చేసిన వ్యాజ్యాల్లో హైకోర్టులో వాదనలు శుక్రవారం ముగిశాయి. రాజధాని అమరావతి మాస్టర్‌ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌ విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మే 9న సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది.

శుక్రవారం జరిగిన విచారణలో సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాజధాని బృహత్‌ ప్రణాళిక రూపకల్పన, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు వ్యవహారాన్ని అప్పటి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్‌ పద్ధతిలో సింగపూర్‌ సంస్థకు అప్పగించిందన్నారు. లింగమనేని సంస్థ, రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, హెరిటేజ్‌ ఫుడ్స్‌ భూములకు సమీపంలో ఇన్నర్‌ రింగ్‌రోడ్డు వచ్చేలా పలుమార్లు ఎలైన్‌మెంట్‌ మార్చారన్నారు. ఆ సంస్థలు అనుచిత లబ్ధి పొందేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. అప్పటి మంత్రి నారాయణ ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు.

మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పన విషయంలో నామినేషన్‌ పద్ధతిపై కాంట్రాక్టు ఇవ్వడానికి సీఆర్‌డీఏ అప్పటి కమిషనర్‌ ఎన్‌.శ్రీకాంత్‌ అభ్యంతరం తెలిపారన్నారు. చట్టవిరుద్ధ నిర్ణయాలు తీసుకున్న వారికి సీఆర్‌డీఏ చట్టం సెక్షన్‌ 146 ప్రకారం రక్షణ ఉండదన్నారు. పిటిషన్లను కొట్టేయాలని కోరారు.

ఎవరినీ ఒత్తిడి చేయలేదు..: మాజీమంత్రి నారాయణ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. రాజధాని మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పనకు ఓసారి టెండర్‌ పిలిచారని, అర్హులు ముందుకు రాకపోవడంతో నామినేషన్‌ ఆధారంగా సింగపూర్‌ సంస్థకు అప్పగించారన్నారు. అప్పటి మంత్రి హోదాలో నారాయణ సమీక్ష సమావేశాల్లో పాల్గొని తన ఆలోచనలను పంచుకున్నారు తప్ప.. ఎవరినీ ఒత్తిడి చేయలేదన్నారు. కక్ష సాధింపు కోసమే కేసు పెట్టారన్నారు. ఏర్పాటే కాని రహదారితో అనుచిత లబ్ధి పొందడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. లింగమనేని సోదరులు, రామకృష్ణ హౌసింగ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, వైవీ రవిప్రసాద్‌ వాదనలు వినిపించారు. పిటిషనర్ల భూములు ప్రతిపాదిత రింగ్‌రోడ్డుకు 5-7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయన్నారు. అనుచిత లబ్ధి పొందామనడంలో వాస్తవం లేదన్నారు. ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు.

ఇవీ చూడండి..:

అగ్నిపథ్​పై ఆందోళనలు.. కేంద్రం మరో కీలక నిర్ణయం

నదుల ఉగ్రరూపం.. వరదల్లో 55 మంది మృతి..19 లక్షల మందిపై ఎఫెక్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.