- రిమోట్ వర్కింగ్...
ఇప్పుడు పనంతా ఇంటి నుంచే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమ్యూనికేషన్ దగ్గర్నుంచి పని పూర్తయ్యేవరకు ప్రతిదానికీ టెక్నాలజీ అవసరం తప్పనిసరి. కాబట్టి, ఎంచుకున్న రంగంతో సంబంధం లేకుండా సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిందే. పని ప్రదేశంలో ప్రాథమికంగా ఏమేం అవసరమో తెలుసుకుని వాటిని నేర్చుకోండి.
- వర్చువల్‌గా...
వీడియో కాలింగ్ ఇప్పుడు ప్రతి ఒక్కరికీ పరిచయమే. ఇప్పుడు ఇంటర్వ్యూ, కాన్ఫరెన్సులనూ ఈ విధానంలోనే నిర్వహిస్తున్నారు. ఇక్కడా శరీర భాష, ముఖ కవళికలకు ప్రాముఖ్యముంటుంది. వాటిని ముందుగానే పరిశీలించుకుని, సరిదిద్దుకోవాలి. అలాగే మాట్లాడటానికే కాదు.. ఓపికగా వినడానికీ సిద్ధమవ్వాలి. ఏం మాట్లాడాలో, మాట్లాడకూడదో తెలుసుకోవడంతోపాటు ఎదుటివారు చెప్పేదానికి ఎలా స్పందించాలో కూడా తెలుసుకోవాలి. ఆసక్తిగా వింటున్నారన్న అభిప్రాయాన్నీ కలిగించాలి.
- భాష..
రంగంతో సంబంధం లేకుండా ఆంగ్లం తప్పనిసరి భాష అయ్యింది. వర్క్ ఫ్రం హోం వాతావరణంలో కమ్యూనికేషన్ అంతా ఈమెయిల్, మెసేజ్‌లు, ఫోన్ల ద్వారానే జరుగుతోంది. దీంతో భాషపై పట్టు ఉండాల్సిందే. దీంతో పాటు తక్కువ పదాల్లో అర్థవంతంగా చెప్పడానికీ ప్రాముఖ్యం పెరుగుతోంది. వీటిపైనా దృష్టిపెట్టండి. తెలుసుకోవడం, చదవడానికే పరిమితం కావొద్దు. తోటివారితో సాధన చేయండి. అప్పుడే వీటిపై పట్టు సాధిస్తారు.