ETV Bharat / city

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వానికి ఏపీఎస్​ ఆర్టీసీ లేఖ

తెలంగాణకు బస్సులు తిప్పేందుకు ఏపీఎస్ ఆర్టీసీ చేస్తున్న ప్రయత్నాలు కీలక దశకు చేరుకున్నాయి. తెలంగాణ భూభాగంలో లక్ష కిలోమీటర్లు తగ్గించి నడిపేందుకు అనుమతించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఏపీఎస్ ఆర్టీసీ కోరింది.

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వానికి ఏపీఎస్​ ఆర్టీసీ లేఖ
ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వానికి ఏపీఎస్​ ఆర్టీసీ లేఖ
author img

By

Published : Oct 13, 2020, 5:24 PM IST

తెలంగాణలో లక్ష కిలోమీటర్లు తగ్గించి బస్సులను నడపడానికి అనుమతివ్వాలని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వాన్ని ఏపీఎస్ ఆర్టీసీ కోరింది. ఇప్పటికే తెలంగాణ అధికారులతో పలుమార్లు చర్చించిన ఆర్టీసీ అధికారులు..ఎన్ని కిలోమీటర్లు బస్సులు నడపాలనే విషయంపై చర్చించారు. ఇరు రాష్ట్రాలు రోజుకు 1.61 లక్షల కిలోమీటర్ల చొప్పున సమానంగా సర్వీసులు నడపాలని దాదాపు నిర్ణయానికి వచ్చాయి.

తెలంగాణ భూభాగంలో ఏపీఎస్ ఆర్టీసీ 2.60 లక్షల కిలోమీటర్లు నడుపుతుండగా...లక్ష కిలోమీటర్లు తగ్గించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ కోరింది. అందుకు ఏపీఎస్ ఆర్టీసీ సంసిద్ధత తెలిపింది. కిలో మీటర్లు తగ్గించే ఆంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకునేందుకు ప్రభుత్వానికి ఆర్టీసీ అధికారులు లేఖ రాశారు. అందులో తెలంగాణ అధికారులతో తాము జరిపిన చర్చల వివరాలను, తెలియాజేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్​కు ఆర్టీసీ ఎండి కృష్ణబాబు లేఖ రాశారు. అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం ఇరు రాష్ట్రాలు సమాన కిలోమీటర్లు తిప్పాల్సి ఉందని...అందుకు అనుగుణంగా ఒప్పందం చేసుకునేందుకు అనుమతించాలని కోరారు.

ఆర్టీసీ లేఖపై ముఖ్యమంత్రి జగన్ ఉన్నతధికారులతో చర్చించే అవకాశాలున్నాయి. రెండు మూడు రోజుల్లో ఒప్పందానికి అనుమతి విషయమై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఒకవేళ ఆర్టీసీ ప్రతిపాదనకు సీఎం అంగీకరిస్తే ఇరు రాష్ట్రాల ఉన్నతధికారులు అతి త్వరలోనే అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. కిలోమీటర్ల విషయమై ఏదైనా మార్పులు సూచిస్తే ఇరురాష్ట్రాల ఉన్నతధికారులు లేదా మంత్రుల స్థాయిలో మరోమారు చర్చించి తగు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇదీ చూండడి: రూ.39కే డ్రెస్​... కొనేందుకు ఎగబడ్డ మహిళలు... దుకాణం బంద్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.