ETV Bharat / city

SEC: ఏపీలో ఈ నెల 19న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు - ఈ నెల 19న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ(zptc, mptc) ఓట్ల లెక్కింపునకు ఆ రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నెల 19న ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కింపు చేపట్టనున్నట్లు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్(SEC) తెలిపింది. ఆ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.

SEC: ఏపీలో ఈ నెల 19న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు

author img

By

Published : Sep 17, 2021, 5:26 AM IST

ఆంధ్రప్రదేశ్​లో హైకోర్టు తీర్పు నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. ఈ నెల 19న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, లెక్కింపు ముగియగానే ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్‌ గురువారం రాత్రి పొద్దుపోయాక వెలువడింది. పోటీ చేసిన అభ్యర్థులు తమ కౌంటింగ్‌ ఏజెంట్ల వివరాలను సంబంధిత రిటర్నింగ్‌ అధికారులకు అందజేయాలని కూడా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

లెక్కింపు ఏర్పాట్లపై శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తదితరులు వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. సమావేశం ఎజెండా ఇప్పటికే జిల్లా అధికారులకు చేరింది. గురువారం కోర్టు తీర్పు వెలువడే సమయానికి ఎస్‌ఈసీ నీలం సాహ్ని దిల్లీలో ఉన్నారు. తీర్పు రాగానే ఆమె హుటాహుటిన బయల్దేరి సాయంత్రానికి విజయవాడ చేరుకున్నారు. రాష్ట్రంలో 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకు ఏప్రిల్‌ 8న పోలింగ్‌ జరిగింది. రాష్ట్రంలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలుండగా, వాటిలో 2,371 ఏకగ్రీవమయ్యాయి. 375 స్థానాలకు ఎన్నికలు జరగలేదు. 81 చోట్ల అభ్యర్థులు చనిపోవడంతో ఎన్నిక వాయిదాపడింది. రాష్ట్రంలో మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలుండగా.. వాటిలో 126 చోట్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. 8 చోట్ల ఎన్నికలు నిర్వహించలేదు. 11 చోట్ల అభ్యర్థులు చనిపోవడంతో వాయిదాపడ్డాయి.

సంబంధిత కథనాలు:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.