తెలంగాణలో మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ.. తమ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని ఏపీ తెరాస నాయకుడు కొణిజేటి ఆదినారాయణ అన్నారు. "ప్రజా ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన కేసీఆర్పై వ్యాఖ్యలు చేయటం సరికాదు" అన్నారు.
భాజపా పాలించే రాష్ట్రాల్లో సైతం నిరుద్యోగం ఉందని ఆయన పేర్కొన్నారు. ఏపీలోని విజయవాడ సీపీ శ్రీనివాసులును కలిసి.. శోభ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని కోరారు.