ETV Bharat / city

వైభవంగా మహాశివరాత్రి వేడుకలు... భక్తులతో పోటెత్తిన శైవక్షేత్రాలు - ఏపీలో మహా శివరాత్రి

మహాశివరాత్రి పర్వదినాన.. ఏపీలోని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి సహా పంచారామ క్షేత్రాలు, ప్రముఖ ఈశ్వరాలయాలు భక్తజన సంద్రమయ్యాయి. లయకారుణ్ని కనులారా వీక్షించి తరించిన జనసందోహం.... అభిషేకప్రియుడికి రకరకాల ద్రవ్యాలతో అభిషేకాలు, పూజలు నిర్వహించారు.

shivaratri
shivaratri
author img

By

Published : Mar 11, 2021, 10:38 PM IST

వైభవంగా మహాశివరాత్రి వేడుకలు... భక్తులతో పోటెత్తిన శైవక్షేత్రాలు

ఏపీలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీశైల మల్లన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి... స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. కల్యాణానికి జనం భారీగా తరలివచ్చారు. మహానంది అలయం భక్తులతో కిటికిటలాడింది. మంత్రాలయంలో పీఠాధిపతి సుబుదేంద్ర శ్రీపాదులవారు... శివ లింగానికి అభిషేకం నిర్వహించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి సర్వదర్శనం, ప్రత్యేక దర్శనానికి వేర్వేరు క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

పంచారామాల్లో భక్తకోలాహలం...

గోదావరి తీరాన ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. పంచారామ క్షేత్రాలకు భక్తులకు తరలివచ్చారు. ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయం, సామర్లకోట కుమారరామంలో భారీగా రద్దీ కొనసాగింది. భీమేశ్వరుడిని మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే చినరాజపప్ప దర్శనం చేసుకున్నారు. పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి, కోనసీమ మురమళ్ల వీరేశ్వరస్వామి, ముక్తేశ్వరం క్షణముక్తేశ్వరుడి దర్శనానికి జనం పోటెత్తారు. రాజమహేంద్రవరం ఉమాకోటిలింగేశ్వరస్వామి, మార్కండేయస్వామి ఆలయాలు కిక్కిరిశాయి. కోటి లింగాలరేవు, పుష్కర్ ఘాట్‌లో భక్తులు స్నానాలు చేశారు. జల్లు స్నానాలు చేసి, నదిలో తర్పణాలు వదిలారు.

పరమశివుడి సేవలో పశ్చిమగోదావరి...

భీమవరం పంచారామక్షేత్రం సోమేశ్వరుడి ఆలయం శివనామస్మరణతో మార్మోగింది. స్వామికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. పాలకొల్లు క్షీరారామ క్షేత్రం, పట్టిసీమ క్షేత్రం కిటికిటలాడాయి. ఆచంట రామేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మేళతాళాలు, అశేష భక్తజనం మధ్య... స్వామివారి రథోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. మంత్రి శ్రీరంగనాథరాజు దంపతులు... స్వామిని దర్శించుకున్నారు.

శివనామ స్మరణలో కృష్ణా, గుంటూరు...

విజయవాడ పున్నమి, కృష్ణవేణి ఘాట్లు, పవిత్ర సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. శివుడికి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గుంటూరు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, అయోధ్యరామిరెడ్డి, వైకాపా నేత మోదుగుల వేణుగోపాలరెడ్డి దర్శించుకున్నారు. పంచారామక్షేత్రం అమరావతి... శివనామ స్మరణతో మార్మోగింది. అమరలింగేశ్వరుడి దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామిని దర్శించుకున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్... ప్రత్యేక పూజలు చేశారు. పేరేచర్ల కైలాసగిరి క్షేత్రానికి భక్తజనులు పోటెత్తారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి... స్వామివారికి క్షీరాభిషేకం చేశారు.

'హరహర మహదేవ' అంటూ...

కడప జిల్లాలో మహేశ్వరుడి మందిరాలు హరహర మహాదేవ అంటూ మార్మోగాయి. పొలతల మల్లికార్జునస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గం శ్రీ జంబుకేశ్వర స్వామి, గుంతకల్లు మండలం శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు కిక్కిరిశారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు... లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు. ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం, పర్చూరు, చినగంజాం శివాలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరంలో నిర్వహించిన శివరాత్రి వేడుకల్లో... మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దంపతులు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా శివాలయాల్లో ఘనంగా పూజలు జరిగాయి.

అభిషేకాల వెల్లువ...

విశాఖ రామలింగేశ్వరుడి ఆలయంతో పాటు నక్కపల్లి మండలం ఉపమాక, గొడిచెర్ల శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. విజయనగరం పశుపతి నాథేశ్వరస్వామి ఆలయంలో క్షీరాభిషేకాలు, రుద్రాభిషేకాలు చేశారు. శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగేశ్వరస్వామి పుణ్యక్షేత్రం, రావివలస ఎండల మల్లికార్జునస్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు.

ఇదీ చదవండి : సత్యం, శివం, సుందరం.. అంటే శివుడే సత్యం అనే అర్థమా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.