ఏపీ సభాపతి తమ్మినేని సీతారాంకి త్రుటిలో ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో సీఎం వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని.. తిరిగి వెళ్తుండగా ఆమదాలవలస మండలం వంజంగి వద్ద ఆటోను తప్పించబోయి సాగునీటి కాలువలోకి కారు దూసుకువెళ్లింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. దీంతో వేరే వాహనంలో తమ్మినేని ఇంటికి చేరుకున్నారు.
ఇదీ చూడండి: గ్రేటర్ పోరు: కుత్బుల్లాపూర్లో ఉద్రిక్తత.. ఎస్సైకి గాయాలు