ETV Bharat / city

రాజకీయ ప్రక్రియకు వాలంటీర్లను దూరంగా ఉంచాలి: నిమ్మగడ్డ - వార్డు వాలంటీర్లపై ఎస్ఈసీ ఆంక్షలు

రాజకీయ ప్రక్రియ నుంచి వాలంటీర్లను పూర్తిగా దూరంగా ఉంచాలని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. అభ్యర్థి, పార్టీకి అనుకూలంగా వాలంటీర్లు వ్యవహారించొద్దని... పథకాల పేరుతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయకూడదన్నారు.

nimmagadda ramesh kumar
రాజకీయ ప్రక్రియకు వాలంటీర్లను దూరంగా ఉంచాలి: నిమ్మగడ్డ
author img

By

Published : Feb 28, 2021, 7:26 PM IST

పురపాలక ఎన్నికల్లో వార్డు వాలంటీర్ల సేవలపై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఈ మేరకు కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు... ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో కమిషన్ మాట్లాడిందని వెల్లడించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే.. వాలంటీర్లపై ఫిర్యాదులు కమిషన్‌కు వచ్చాయని తెలిపారు. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తేలితే స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం వాలంటీర్లపై కఠినమైన చర్యలు అవసరమని ఎస్ఈసీ అభిప్రాయపడ్డారు. వాలంటీర్లను రాజకీయ ప్రక్రియ నుంచి పూర్తిగా దూరంగా ఉంచాలని ఆదేశించారు.

అభ్యర్థి, పార్టీకి అనుకూలంగా వాలంటీర్లు ప్రచారంలో పాల్గొనకూడదు. పథకాల పేరుతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయకూడదు. ఓటరు స్లిప్పుల పంపిణీని వార్డు వాలంటీర్లకు అప్పగించవద్దు. వార్డు వాలంటీర్ల కదలికలను నిశితంగా పరిశీలించాలి. లబ్ధిదారుల డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉన్నందున వాలంటీర్ల ఫోన్లను నియంత్రణలో ఉంచాలి. లేకుంటే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పరిగణిస్తాం. వాలంటీర్లను సాధారణ బాధ్యతల్లో నిర్వహించడంలో ఎలాంటి అడ్డంకులు లేవు.

- ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్

ఇవీచూడండి: 'ఫీజు వేధింపులు ఆపకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.