ETV Bharat / city

ఏపీ : ద్వివేది, గిరిజా శంకర్​లపై బదిలీ వేటు, అభిశంసన

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు సీనియర్ ఐఎఎస్ అధికారులపై ఏపీ ఎన్నికల కమిషన్ చర్యలకు దిగింది. పంచాయితీరాజ్ శాఖ ముఖ్యకార్యద్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ వారి విధుల నిర్వహణలో ఉద్దేశపూర్వకంగా తప్పిదాలకు పాల్పడ్డారని ఎస్ఈసీ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్​ కుమార్.. ప్రోసిడింగ్స్​ను జారీ చేశారు. ఎన్నికల కమిషన్ పేర్కొన్న అభియోగాలు వారి సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాల్సిందిగా ఆదేశించారు. ఇరువురు అధికారులు ఉద్దేశపూర్వకంగా ఎన్నికల సంఘానికి సహకరించలేదని.. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించారని పేర్కొన్నారు.

PROCEEDINGS ON PANCHAYATI RAJ
'వారి నిర్లక్ష్యం వల్ల 3.62 లక్షల మంది ఓటు హక్కు కోల్పోయారు'
author img

By

Published : Jan 27, 2021, 7:46 AM IST

ఏపీ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్​ గిరిజా శంకర్‌లను బదిలీ చేస్తూ, అభిశంసిస్తూ ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ మంగళవారం ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. అభిశంసన ఉత్తర్వులను వారి సర్వీసు రికార్డుల్లో చేర్చాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన సహకారాన్ని, సిబ్బందిని, వనరులను ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సమకూర్చాలని హైకోర్టు ఆదేశించినా ద్వివేది, గిరిజా శంకర్‌ పెడచెవిన పెట్టారని, ఎంత మాత్రం సహకరించలేదని పేర్కొన్నారు. 2021 ఓటర్ల జాబితాల్ని సిద్ధం చేయడంలో వాళ్ల నిర్లక్ష్యంవల్ల ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో 3.62 లక్షల మంది యువత ఓటుహక్కు కోల్పోతున్నారని తెలిపారు. వారిద్దరి సారథ్యంలోని పంచాయతీరాజ్‌శాఖ, తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఘోరంగా విఫలమయ్యాయని రమేశ్‌ కుమార్‌ మండిపడ్డారు. వారిద్దరూ కావాలని, దురుద్దేశపూర్వకంగా వ్యవహరించారని, తమ బాధ్యతను విస్మరించారని తెలిపారు.

క్షమించరాని తప్పిదం..

ఇదేదో సాధారణ పొరపాటు కాదని, క్షమించరాని తప్పిదమని నిమ్మగడ్డ పేర్కొన్నారు. 2021 ఓటర్ల జాబితాలను ప్రచురించాలన్న ఏపీ ఎన్నికల సంఘం ఆదేశాలను వారు ఖాతరు చేయకపోవడంవల్ల, విధిలేని పరిస్థితుల్లో, స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్న రాజ్యాంగ విధిని నిర్వర్తించేందుకు 2019 ఓటర్ల జాబితాల ఆధారంగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ‘ఎన్నికలకు, తద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించేందుకు వారిద్దరూ గట్టిగా ప్రయత్నించారు. యువత ఓటు హక్కు కోల్పోవడానికి వారిద్దరిదే పూర్తి బాధ్యత. వారు చేసిన తప్పు క్షమించరానిది’ అని పేర్కొన్నారు. ద్వివేది, గిరిజా శంకర్‌ల వైఖరిని తీవ్ర పదజాలంతో తప్పుపడుతూ రమేశ్‌ కుమార్‌ 8 పేజీల అభిశంసన ఉత్తర్వులు జారీ చేశారు.

ఆ బాధ్యతలను నిర్వహించే అర్హతలు వారికి లేవు
గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌ల వ్యవహార శైలిని చూస్తే... పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనరు విధులు నిర్వర్తించేందుకు వారు పనికిరారని రమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ‘73వ రాజ్యాంగ సవరణ నిర్దేశించిన క్షేత్ర స్థాయి ప్రజాస్వామ్యం, స్థానిక సంస్థల సాధికారత భావనలను ద్వివేది విస్మరించారు. రాజ్యాంగంలోని 326వ అధికరణం ప్రకారం పౌరులకు ఓటుహక్కు కల్పించాల్సిన విషయంలో వ్యతిరేక ధోరణితో వ్యవహరించారు. ఎన్నికల సంఘంతో చర్చల సందర్భంలోనూ ఆయన విరుద్ధ భావనలతో ఉండేవారు. కమిషన్‌ స్వతంత్రతకు భంగం కలిగించేందుకు ప్రయత్నించారు. గతంలో ఆయన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతాయుతమైన పదవిలో పని చేశారు. ఎన్నికల విధులు, బాధ్యతల గురించి ఆయనకు అవగాహన ఉన్నా.. ప్రస్తుత బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడంలో వివేకం, పరిణతి లేకుండా వ్యవహరించారు. ఈ పరిస్థితుల్లో ఆయన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగడం క్షేత్ర స్థాయిలోని ప్రజాస్వామ్య సంస్థల పనితీరుకు విఘాతం కలిగిస్తుంది. ఆ పోస్టులో కొనసాగేందుకు అవసరమైన అర్హతలు, బుద్ధి, మనసు ఆయనకు లేవని పదే పదే రుజువైంది’ అని రమేశ్‌ కుమార్‌ అభిశంసించారు. గిరిజాశంకర్‌ విషయంలోనూ ఆయన ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ప్రచురించాలని చెప్పినా పట్టించుకోలేదు
ఓటర్ల జాబితాలను రూపొందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది... తద్వారా పంచాయతీరాజ్‌ శాఖదేనని రమేశ్‌ కుమార్‌ తెలిపారు. 1994 పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం... కేంద్ర ఎన్నికల సంఘం ప్రచురించిన ఓటర్ల జాబితాలనే రాష్ట్ర ఎన్నికల సంఘం స్వీకరిస్తుందని, దాన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వార్డులు, డివిజన్ల వారీగా వర్గీకరించి జాబితాలు ప్రచురిస్తామని తెలిపారు. ‘2021 ఓటర్ల జాబితాల ఆధారంగానే ప్రస్తుత ఎన్నికలు నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించింది. ఆ మేరకు 2020 నవంబరులోనే పంచాయతీరాజ్‌శాఖ కమిషనరుకు ఆదేశాలిచ్చాం. జిల్లాలవారీగా ఓటర్ల జాబితాల హార్డ్‌, సాఫ్ట్‌కాపీల ప్రచురణ ప్రక్రియ చేపట్టాల్సిందిగా డీపీవోలను ఆదేశించాలని సూచించాం. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జనవరి 16కు తుది జాబితా ప్రచురిస్తారు కాబట్టి... దాని ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ఓటర్ల జాబితాల ప్రచురణకు 2021 జనవరి 25ని గడువుగా నిర్దేశించాం. దానిపై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తరచూ పంచాయతీరాజ్‌ కమిషనరుతో మాట్లాడుతూనే ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి ముసాయిదా ఓటర్ల జాబితాల్ని తీసుకోవాలన్న ఆదేశాల్ని విశాఖపట్నం డీపీవో తప్ప మరెవ్వరూ పట్టించుకోలేదు. అదే విషయాన్ని కమిషనరు దృష్టికి తీసుకెళ్లాం. సకాలంలో ఆ ప్రక్రియ పూర్తి చేయాలని కోరాం’ అని రమేశ్‌కుమార్‌ తెలిపారు.

కోర్టుకిచ్చిన హామీనీ విస్మరించారు
‘ఎన్నికల సంఘానికి సహకరిస్తామని రాష్ట్ర హైకోర్టుకు ఇచ్చిన హామీనీ ద్వివేది, గిరిజా శంకర్‌ విస్మరించారు. ఎన్నికల సంఘంలో సంయుక్త కార్యదర్శి పదవి కోసం ప్రభుత్వం పంపించిన ప్యానల్‌ నుంచి ఒక పేరును సూచించాం. కానీ ఆ నియామకాన్ని ద్వివేది ఇప్పటివరకూ చేపట్టలేదు. ఈ నెల 8న రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం ఒక సమావేశం నిర్వహించింది. పెండింగ్‌లో ఉన్న అంశాల్ని సీఎస్‌ సమక్షంలోనే ద్వివేది దృష్టికి తెచ్చాం. ఈనెల 9న ఒక లేఖ కూడా రాశాం. కానీ ఇప్పటివరకూ వారి నుంచి ఎలాంటి సానుకూల స్పందనా లేదు’ అని రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు.

ప్రభుత్వ ప్రతిపాదనల్ని తిరస్కరించిన ఎస్‌ఈసీ

గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌లపై చర్యలు తీసుకోవడానికి ముందే.. వారిద్దరినీ బదిలీ చేస్తున్నట్లుగా సోమవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. వారి స్థానంలో పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శిగా పూనం మాలకొండయ్య, కమిషనరుగా విజయకుమార్‌ల పేర్లను సూచించినట్లు ఎన్నికల కమిషన్‌ వర్గాల ద్వారా తెలిసింది. ఆ ప్రతిపాదనను రమేశ్‌ కుమార్‌ తిరస్కరించారని సమాచారం. ఆ తర్వాత ఆయనే వారిద్దరినీ బదిలీ చేస్తూ, అభిశంసిస్తూ మంగళవారం ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు.

ఇదీ చదవండి: నేడు పీఆర్​సీ నివేదిక విడుదలయ్యే అవకాశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.